Friday, December 13, 2024

మేం ఎమ్మెల్యేలం కాదా..?

అసెంబ్లీలో కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య వర్డ్స్ వార్

తెలంగాణ శాసనసభకు సోమవారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హాజరుకాకపోయినా.. తొలిరోజు సమావేశాల్లో కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. సభ ప్రారంభంకాగానే తెలంగాణ తల్లి విగ్రహంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. దీనిపై వివిధ పార్టీల సభ్యులు మాట్లాడుతూ తమ అభిప్రాయాలను తెలియజేశారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై జరిగిన చర్చ సందర్భంగా ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలకు తగిన గౌరవం లభించడంలేదన్నారు. దక్షిణ తెలంగాణకు పూర్తి అన్యాయం జరుగుతోందని, తమ నియోజకవర్గాల అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

తన ఐడి కార్డును చూపిస్తూ ఈ కార్డుకు విలువలేకుండా పోయిందని, తాను ఆర్మూరు ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యేనో కాదో చెప్పాలన్నారు. స్పీకర్ శాసనసభకు తండ్రి వంటి వారని, సభ్యుల గౌరవానికి భంగం కలిగించకుండా చూసే బాధ్యత స్పీకర్‌దని పేర్కొన్నారు. ఇటీవల ఆర్మూరు నియోజకవర్గం పరిధిలో జరిగిన ఓ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థిని ఎమ్మెల్యేగా మంత్రి పరిచయం చేశారని ఆరోపిస్తూ.. రాకేశ్ రెడ్డి ప్రోటోకాల్ అంశాన్ని శాసనసభలో లేవనెత్తారు. కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి సైతం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు గౌరవం దక్కడం లేదన్నారు. తన గురించి మాట్లాడటం లేదని ఎమ్మెల్యేల గౌరవం విషయంలో తాను మాట్లాడుతున్నట్లు చెప్పారు. ఈ అంశంపై బీజేపీ సభ్యులు, కాంగ్రెస్ మంత్రుల మధ్య కాసేపుతీవ్ర వాగ్వాదం కొనసాగింది.

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular