Friday, November 15, 2024

మీ అన్నగా పిలుపునిస్తున్నా…డ్రగ్స్ నిర్మూలనకు సహకరించండి

డ్రగ్స్‌పై ఇప్పటికే యుద్ధం ప్రకటించాం
విద్యార్థులు డ్రగ్స్‌కు బానిసైతే ఈ సమాజం ఏం కావాలి
ఉద్యమాల గడ్డ తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి
తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించాలి
క్రీడాకారులుగా రాణిస్తే తప్పుకుండా ప్రభుత్వ ఉద్యోగం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించామని, ఈ యుద్ధంలో ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు కూడా కలిసి రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. యూనిఫాం లేని పోలీసులు ఎన్‌ఎస్‌ఎస్ అని, మోరల్ పోలీసింగ్ చేయాల్సిన బాధ్యత కూడా ఎన్‌ఎస్‌ఎస్‌దేననిఅన్నారు. శనివారం జేఎన్టీయూలో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నియంత్రణ, మహిళల భద్రత, ట్రాఫిక్ క్రమబద్దీకరణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా ఉన్నది విద్యార్థులేనని, అలాంటి విద్యార్థులు డ్రగ్స్‌కు బానిసైతే ఈ సమాజం ఏం కావాలని ప్రశ్నించారు. డ్రగ్స్ వల్ల యువత నిర్వీర్యం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం వల్లే పిల్లలు పక్కదారి పడుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యార్థులు అందరూ మన పిల్లలే అనేలా ఉపాధ్యాయులు చూసుకోవాలని, వారికి మంచి ఏదో చెడు ఏదో చెప్పాల్సిన బాధ్యత మనదేనని అన్నారు.

తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించాలని, వారి ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచాలని సూచించారు. పిల్లలకు మోరల్ పోలీసింగ్ నేర్పాలని స్కూళ్లు, కళాశాలల యాజమానులకు చెప్పామని, పిల్లల ప్రవర్తనలో తేడా వస్తే తల్లిదండ్రులకు చెప్పాలన్నారు. బాధ్యత కలిగిన పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. పోలీసు ఆఫీసర్స్ వారంలో రెండు రోజులు స్కూళ్లు, కళాశాలలకు వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. ఇక క్రీడాకారులను తమ ప్రభుత్వం మరింత ప్రోత్సాహిస్తోందని స్పష్టం చేశారు. చదువుకుంటే ఉద్యోగం వస్తుందో, రాదో తెలియదు కానీ క్రీడాకారులుగా రాణిస్తే తప్పుకుండా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యువత సమస్యలకు ఎప్పుడూ భయపడకూడదని చెప్పారు.

కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నం కావడం వల్లే పిల్లలు పక్కదారి…

విద్యార్థులకు మంచీ చెడులు చెప్పాల్సిన బాధ్యత మన పైనే ఉందని, విద్యార్థులందరూ మన పిల్లలు అనేలా అందరూ చూసుకోవాలని సూచించారు. డ్రగ్స్ వల్ల యువత నిర్వీర్యం అవుతోందని, కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నం కావడం వల్లే చాలామంది పిల్లలు పక్కదారి పడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థులకు మంచీ చెడులు చెప్పాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. విద్యార్థులందరూ మన పిల్లలు అనేలా అందరూ చూసుకోవాలని సూచించారు. డ్రగ్స్ వల్ల యువత నిర్వీర్యం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు సమయం కేటాయిం,ఇ వారికి మంచీ చెడులు చెప్పాలన్నారు. సమాజంలో ఉండే సమస్యలను మనమే గుర్తించి పరిష్కరించుకుంటే దుష్ఫలితాలను నివారించుకోవచ్చని, సమాజంలో పెడధోరణులకు టెక్నాలజీ కూడా ఓ కారణంగా మారిందని, పిల్లలను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచితే చాలా సమస్యలను నివారించవచ్చన్నారు.

కుటుంబ వ్యవస్థ విచిన్నం కావడమే చిన్నారుల మానసిక బలహీనతలను కారణమని, చిన్నారుల మానసిక దృఢత్వానికి ఉమ్మడి కుటుంబం తోడ్పడుతుందన్నారు. పిల్లలను మానసికంగా సంసిద్ధం చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం పిల్లలకు సోషల్ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్ నేర్పించాల్సిన అవసరం ఉందని, డ్రగ్స్ నిర్మూలనపై సీరియస్ గా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్కూల్స్,కాలేజెస్ లో సబ్జెక్ట్ నేర్పించడమే కాకుండా మోరల్ పోలీసింగ్ కూడా నేర్పించాలని, పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనించే వ్యవస్థ ఉండాలని నిర్వాహకులకు సూచించామన్నారు. స్కూళ్లు, కాలేజీల్లో ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్స్ అవసరం ఎంతో ఉందని, పోలీసులకు సమాచారం చేరవేసేలా వ్యవస్థను తయారు చేసుకుంటే రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చవచ్చన్నారు. డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోను ఏర్పాటు చేసిందని వివరించారు.

ఉద్యమాల గడ్డ తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి…

ఉద్యమాల గడ్డ తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని రేవంత్‌రెడ్డి కోరారు. అన్ని ఇంటర్ , డిగ్రీ కళాశాలల్లో కేరళ మాదిరిగా మోరల్ పోలీసింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. మోరల్ పోలీసింగ్ తో అన్ని రకాల సమస్యలను పరిష్కరించవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలని నిర్ణయించిందని, అందుకే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక స్టేడియం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. భవిష్యత్ లో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు.

ప్రజాప్రతినిధి అనేది అత్యంత పవిత్రమైన బాధ్యత అని, ప్రజా సమస్యలపై ఫోకస్ గా పనిచేయడం వల్లే తాను ఈ స్థాయికి చేరానన్నారు. సమస్యలకు భయపడి పారిపోవద్దు. నిలబడి సమస్యలపై పోరాడాలని, జీవితంలో ఫోకస్ గా పనిచేయండి.. లక్ష్యాలను సాధిస్తారన్నారు. నరేంద్రమోడీకైనా, బిల్ గేట్స్ కైనా, రేవంత్ రెడ్డికైనా రోజుకు 24 గంటలేనని, రోజుకు 16గంటలు మీరు ఎంత ఫోకస్ గా పని చేస్తారో అది మీ లక్ష్యాన్ని అంత చేరువ చేస్తుందన్నారు. మన జీవితం మన చేతుల్లోనే ఉంది. మన జీవితాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలో మన చేతుల్లోనే ఉంటుంది. గొప్ప వ్యక్తులు ఎవరూ గొప్ప కుటుంబాల నుంచి రాలేని, ఎవరూ ఎవరికంటే తక్కువ కాదని తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular