Saturday, May 10, 2025

అందుకే మేము దాడి చేశాము

పాకిస్థాన్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. భారత్ సైనిక చర్యలు నిలిపివేస్తే, ఉద్రిక్తతలు తగ్గించేందుకు తాము కూడా చర్యలు తీసుకుంటామని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ స్పష్టం చేశారు. “మా సహనం నశించాకే ప్రతిస్పందించాం. భారత్ ఇక్కడ ఆగిపోతే, మేము కూడా ఆగిపోయే అంశాన్ని పరిశీలిస్తాం” అని ఇషాక్ దార్ పాకిస్థాన్‌కు చెందిన జియో న్యూస్‌తో అన్నారు. భారత్ మళ్లీ దాడులకు పాల్పడితే, తమ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు తెలియజేశానని వెల్లడించారు. రెండు గంటల క్రితం న్యూఢిల్లీతో మాట్లాడిన అనంతరం రూబియో తనను సంప్రదించారని దార్ తెలిపారు. పాకిస్థాన్ సంయమనం పాటిస్తే, ఘర్షణలను పెంచబోమని భారత్ ఇదివరకే స్పష్టం చేసింది.
దేశం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభం, క్షీణిస్తున్న ప్రజల జీవన పరిస్థితుల నేపథ్యంలో, యుద్ధ వాతావరణం మరింత నష్టం కలిగిస్తుందన్న ఆందోళన పాక్‌లో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే, ఉద్రిక్తతలను తగ్గించి, న్యూఢిల్లీతో చర్చలు జరపడానికి ఇస్లామాబాద్ సిద్ధంగా ఉందని పాక్ అధికారిక వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించి, శాంతియుత వాతావరణం నెలకొల్పాల్సిన అవసరం ఉందని ఆ వర్గాలు అభిప్రాయపడ్డాయి. భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరకుండా ఇరు దేశాలు సంయమనం పాటించాలని, దాడుల నివారణకు చర్యలు తీసుకోవాలని అమెరికా సూచించింది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com