కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణాకు రానున్నారు. సాయంత్రం 5:30కు రాహుల్ వరంగల్ జిల్లా హన్మకొండకు చేరుకోనున్నారు. అక్కడ ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్ లో వరంగల్ జిల్లా హన్మకొండకు వెళ్లనున్నారు. హన్మకొండలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన అనంతరం పార్టీ నేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సాయంత్రం హోటల్ సుప్రభలో కాసేపు విశ్రాంతి తీసుకొని.. రాత్రి 7 గంటలకు తిరిగి అక్కడి నుంచి తమిళనాడు బయదేరనున్నారు. తెలంగాణకు రాహుల్ గాంధీ ఆకస్మిక పర్యటన పార్టీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
తెలంగాణకు రాహుల్ గాంధీ సడన్ టూర్ చర్చనీయాంశంగా మారింది. రాహుల్ ఆకస్మిక పర్యటనపై రాజకీయ విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, పరిస్థితులను గురించి స్వయంగా తెలుసుకోవడానికి రాహుల్ వచ్చినట్లుగా అనుకుంటున్నారు.