కన్నీళ్లు పెట్టిస్తోన్న వసీమ్ సూసైడ్ లెటర్
సరిగ్గా జీతాలు రాక, కుటుంబ సమస్యలతో సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న వసీమ్ ఆత్మహత్య చేసుకున్నారు. తనను క్షమించాలంటూ తన భార్యకు వసీమ్ రాసిన సూసైడ్ లెటర్ కన్నీళ్లు పెట్టిస్తోంది. ‘డియర్ రజనీ. నిన్ను చాలా బాధపెట్టా. మనకు ఎవరూ లేరు. పిల్లలు అలా కాకూడదని చాలా ఊహలు కన్నా. కానీ ఏదీ కుదరలేదు. వచ్చే జన్మలో నా పిల్లలకే కొడుకుగా పుడతా’ అని రాశారు. తాను కొందరి వద్ద చేసిన అప్పును చెల్లించాలని భార్యను కోరారు.
కింద వాళ్ల పేర్లు రాస్తున్న.. ఇవ్వకపోతే వాళ్లు తిట్టుకుంటారు.. అని లేఖలో రాశాడు. కాగా, ఫజియాబేగం అసలు పేరు రజని. రజని, వసీం మతాంతర వివాహం చేసుకున్నారు. భార్య ఫజియా బేగం పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ రాజశేఖర్ తెలిపారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాటలన్నీ అవాస్తవాలని కేటీఆర్ విమర్శించారు. సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న వసీమ్ అనే ఉద్యోగి 3 నెలలుగా జీతాలు రాక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని కేటీఆర్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. అతని మరణానికి బాధ్యులెవరు? అని ప్రశ్నించారు.