Sunday, November 17, 2024

గ్రామాల్లో పాత బావులు, బోర్లు, చేతిపంపులు వినియోగంలోకి…

నీటి కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు
మిషన్ భగీరథ నీళ్లు అందని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ఇందుకోసం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద ఎమ్మెల్యేలకు కేటాయించిన నిధులను వాడుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఫీల్డ్ స్టాఫ్ ప్రతిపాదనలకు తగ్గట్టుగా ఆఫీసర్లు గ్రామాల్లోని పాత బావులను, బోర్లను, చేతిపంపులను వినియోగంలోకి తీసుకువస్తు న్నారు. బోర్లు పడని చోట్ల ట్యాంకర్ల ద్వారా వాటర్ సప్లై చేస్తూ భగీరథ ఇబ్బందుల నుంచి జనాలకు కొంత ఉపశమనం కలిగిస్తున్నారు. ఎండాకాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం, పర్యవేక్షణ కోసం జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లను కూడా నియమించింది.

ఎక్కడ సమస్య తలెత్తినా 24 గంటల్లో పరిష్కరించేలా మిషన్ భగీరథ, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ, ఫీల్డ్ లెవల్లో భగీరథ గ్రిడ్ నుంచి తక్కువ ప్రెజర్‌తో వస్తున్న వాటర్ గ్రామాలకు చేరకపోవడం, ట్యాంకుల నుంచి విడుదల చేసే ఇంట్రా పైపులైన్లు ఎక్కడికక్కడ పగులుతుండడం వల్ల తాము ఏమీ చేయలేకపోతున్నామని అధికారులు కలెక్టర్లకు మొరపెట్టుకున్నారు. ఇదే విషయమై ప్రభుత్వానికి కలెక్టర్‌లు నివేదిక సమర్పించడంతో ఎమ్మెల్యేలకు కేటాయించిన నిధులను వాడుకోవాలని ప్రభుత్వం సూచించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular