Saturday, January 4, 2025

Srisailam Dam Water Leak శ్రీశైలంకు థ్రెట్​…?

ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో వాటర్ లీకేజీ

శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో వాటర్ లీకేజీ అవుతోంది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమల పెంట గ్రామం వద్ద ఉన్న ఈ భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో గత పది రోజులుగా నీరు లీకవుతున్నది. 1వ యూనిట్‌ డ్రాఫ్ట్‌ ట్యూబ్‌ జీరో ఫ్లోర్‌ నుంచి ఈ లీకేజీ జరుగుతున్నట్లు గుర్తించారు. 2024 సెప్టెంబరు 18న మొదటి సారి సన్నటి నీటి చుక్కలుగా లీకేజీ ప్రారంభం కాగా, నెల రోజుల నుంచి నిరంతరాయంగా విద్యుత్‌ ఉత్పాదనతో పాటు, పంపు మోడ్‌ పద్ధతిలో శ్రీశైలం డ్యాంలోకి నీటి మళ్లింపు కొనసాగుతోంది. పంపు మోడ్‌లో టర్భైన్‌ వేగంగా తిరుగుతుండటంతో డ్రాఫ్ట్‌ ట్యూబ్‌ జీరో ఫ్లోర్‌ స్లాబ్‌ నుంచి డిసెంబరు 25న పంపు మోడ్‌ జరిగే సమయంలో నీటి చుక్కలు ధారలా పడుతుండటంతో జెన్‌కో అధికారులు అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

అయితే, సర్జి చాంబర్‌, పెన్‌స్టాక్‌ గేట్లను మూసి వేసి, టర్భైన్‌లో నిలువ నీటిని పూర్తిగా తొలగిస్తే తప్ప లీకేజీ అవుతున్న ప్రాంతాన్ని గుర్తించే పరిస్థితి లేదు. ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రాన్ని 24 ఏళ్ల క్రితం నిర్మించారు. లీకేజీ నీటి ధారలను అరికట్టకపోతే జోరో ఫ్లోర్‌ స్లాబ్‌ కూడా పడిపోయే ప్రమాదం ఉందని కొందరు ఇంజనీర్లు, మాజీ ఉద్యోగులు చెబుతున్నారు. మరోవైపు, నీరు లీకవుతున్న ప్రాంతాన్ని హైదరాబాద్‌ విద్యుత్‌ సౌధ నుంచి జర్నల్‌ హైడెల్‌ సీఈ నారాయణ పరిశీలించారు. తక్షణమే పూర్తి వివరాలతో నివేదిక రూపొందించాలని స్థానిక ఇంజనీర్లను ఆదేశించారు. కాగా, ఒకటో యూనిట్‌ డ్రాఫ్ట్‌ ట్యూబ్‌ దగ్గర లీకేజీ అవుతున్న నీటి ధారలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని జెన్‌కో సివిల్‌ ఎస్‌ఈ రవీంద్ర కుమార్‌ తెలిపారు. అనుభవం ఉన్న నిపుణులతో చర్చించి ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com