ముంబైలోని ‘వేవ్స్ సమ్మిట్ 2025’కి పలువురు సెలబ్రిటీలు అటెండ్ అవుతున్నారు. అందులో ‘ఎమ్4ఎమ్’ హీరోయిన్ జో శర్మ కూడా ఉన్నారు. స్టార్స్ అందరితో ఆవిడ సెల్ఫీలు దిగారు. ఇప్పుడు ఇండియా అంతటా ‘వేవ్స్ సమ్మిట్ 2025’ గురించి డిస్కషన్ జరుగుతోంది. స్టార్ హీరోలు, డైరెక్టర్లు అటెండ్ అవ్వడం మాత్రమే కాదు… తమ అభిప్రాయాలను చెబుతున్నారు. ఈ సమ్మిట్‌కు టాలీవుడ్ హీరోయిన్, ‘ఎమ్4ఎమ్’ సినిమా చేస్తున్న జో శర్మ కూడా పాల్గొన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డెలిగేట్‌గా పాల్గొనాలని ఆహ్వానం అందిందగా… ఆవిడ వెళ్లారు. అక్కడ పలువురు స్టార్ డైరెక్టర్లు, హీరోలతో కలిసి ముచ్చటించారు. సెల్ఫీలు దిగారు. మలయాళ మెగాస్టార్, పాన్ ఇండియా రికగ్నైజేషన్ ఉన్న మోహన్ లాల్ తో జో శర్మ. ఈ సమ్మిట్‌లో పాల్గొన్న కొత్త హీరోయిన్ జో శర్మ కావడం విశేషం. అప్ కమింగ్ హీరోయిన్లలో ఆవిడకు ఇంపార్టెన్స్ లభిస్తోందని చెప్పవచ్చు.
ఆమీర్ ఖాన్ తో జో శర్మ. ‘ఎమ్4ఎమ్’ అంటే మోటివ్ ఫర్ మర్డర్’ అని మీనింగ్, ఇదొక థ్రిల్లర్ సినిమా. ఈ సినిమాలో హీరోయిన్‌గా జో శర్మ నటించారు. మోహన్ వడ్లపట్ల దర్శకత్వంలో ‘ఎమ్4ఎమ్’ సినిమాను మోహన్ మీడియా క్రియేషన్స్ సంస్థ, జో శర్మ మెక్‌విన్ గ్రూప్ యూఎస్ఏ సంయుక్తంగా నిర్మించాయి. దర్శక ధీరుడు రాజమౌళితో జో శర్మ. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేతులు మీదుగా ప్రారంభమైన ‘వేవ్స్ సమ్మిట్ 2025’ మే 4, 2025 వరకు జరుగుతుంది.