Monday, May 19, 2025

భద్రాద్రి తలంబ్రాలను ఇంటి వద్దకే అందిస్తాం

భక్తులకు శుభవార్త చెప్పిన ఆర్టీసి
భద్రాద్రి తలంబ్రాలను ఇంటి వద్దకే అందిస్తామని భక్తులకు ఆర్టీసి శుభవార్త చెప్పింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహకారంతో రాములోరి తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేర్చే కార్యక్రమాన్ని ఆర్టీసి చేపట్టింది. ఈ విషయమై తాజాగా తెలంగాణ ఆర్టీసి ఎండి సజ్జనార్ మంగళవారం ట్వీట్ చేశారు. భద్రాచలంలో నేడు జరిగే శ్రీ సీతారామచంద్రుల వారి కల్యాణ తలంబ్రాలను ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని తెలంగాణ ఆర్టీసి కల్పించిం దని ఆయన తెలిపారు.

ఇందుకోసం సంస్థ లాజిస్టిక్స్ విభాగ వైబ్ సైట్ tsrtclogistics.in సందర్శించి విశిష్టమైన రాములోరి కల్యాణ తలంబ్రాలను పొందాలని సజ్జనార్ భక్తులతో తెలిపారు. ఆన్‌లైన్ తలంబ్రాలను ఎలా బుక్ చేసుకోవాలో వివరిస్తున్న వీడియోను ఆయన షేర్ చేశారు. అలాగే ఆఫ్‌లైన్‌లోనూ తలంబ్రాలను బుక్ చేసుకునే అవకాశం కల్పించినట్టు ఆయన తెలిపారు. ఇందుకోసం భక్తులు టిఎస్ ఆర్టీసి కాల్ సెంటర్ ఫోన్ నంబర్‌లైన 040- 23450033, 040 -69440069ను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com