Friday, December 27, 2024

చెరువు కబ్జాను అడ్డుకుంటాం

నగరంలో కబ్జాదారుల భూదాహానికి ఎన్నో చెరువులు కనుమరుగైపోతున్నా అధికారులకు చీమ కుట్టినట్టయినా లేదని సెంటర్ ఫర్ వెల్‌ బీయింగ్ ఎకనామిక్స్ హైదరాబాద్‌ వ్యవస్థాపక డైరెక్టర్, సోషల్ యాక్టివిస్ట్ లుబ్నా సర్వత్‌ ఆవేదన వ్యక్తంచేశారు. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని బమ్‌ రుక్‌ నాథ్ చెరువు ఉదంతమే దీనికి ఉదాహరణగా అమె పేర్కొన్నారు. సోమాజీగూడా ప్రెస్‌ క్లబ్‌ లో లుబ్నా సర్వత్‌ విలేకరులతో మాట్లాడుతూ జీవకోటి మనుగడకు పాటు పడే చెరువులను సంరక్షించుకోవడంలో ఇటు ప్రజలు, అటు పాలకులు ఘోరంగా విఫలమవుతున్నారని అన్నారు. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని శివరాంపల్లిలో జాతీయ పోలీసు అకాడమీ ఎదురుగా వందలాది ఎకరాల విస్తీర్ణంలో బమ్‌ రుక్‌ నాథ్ చెరువు విస్తరించి ఉండేదని తెలిపారు.

నిజాముల కాలంలో ఎంతో మంది దాహం తీర్చిన ఈ చెరువు క్రమేణా భారీగా దురాక్రమణలకు గురైందని లుబ్నా సర్వత్‌ వెల్లడించారు. కబ్జాదారులకు వంతపాడిన అధికారులు 2017 లో ఈ చెరువు విస్తీర్ణం 17 ఎకరాలుగా తేల్చారని, అయితే వాస్తవ పరిశీలిన చేస్తే అది పది ఎకరాలు కూడా లేదని తేలిందని ఆమె తెలిపారు. స్థానికులు నీటి అవసరాలు తీర్చడానికి ఎంతగానో తోడ్పడుతున్న ఈ బమ్‌ రుక్‌ నాథ్ చెరువు పరిరక్షణకు తాను సంకల్పింనట్టు ఆమె చెప్పారు. దీనిపై తాను నేషనల్ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ను ఆశ్రయించగా చర్యలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం చేస్తోందని ఆమె ఆరోపించారు. అందుకే ఈ విషయంలో సుప్రీకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్టు తెలిపారు. చెరువు పరిరక్షణకు తాము చేస్తున్న పోరాటానికి స్థానికులు తోడ్పాటునందించాలని కోరారు. ఈ సమావేశంలో ఏపీ మెనార్టీ కమిషన్ మాజీ సభ్యుడు, న్యాయవాది సయ్యద్‌ తారక్‌ ఖాద్రీ, ఫారుఖ్‌ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com