-
రాష్ట్రంలో ఐటీ, పరిశ్రమల అభివృద్ధి కోసం ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాం
-
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు
రాష్ట్రంలో ఐటీ, పరిశ్రమల అభివృద్ధి కోసం ఆవిష్కరణలను ప్రోత్సహించి, శ్రామిక శక్తి నైపుణ్యాలను పెంపొందించే విధానం ద్వారా ఉపాధి అవకాశాలను సృష్టించవచ్చని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. అమెరికాలోని అట్లాంటాలో జరిగిన ఆటా (ATA) బిజినెస్ సెమినార్‌లో పాల్గొని ఆయన మాట్లాడారు. పెద్ద పరిశ్రమలకే పరిమితం కాకుండా మధ్య, చిన్న తరహా పరిశ్రమలను ఆహ్వానించటం ద్వారా వృద్ధిని సాధించవచ్చని ఆయన తెలిపారు. రాష్ట్రంలో సమ్మిళిత అభివృద్ధిని సాధించడానికి విద్య, ఆరోగ్య మౌలిక సదుపాయాలకు సంబంధించిన మెరుగైన ప్రభుత్వ విధానాలు రూపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌ను ఏఐ రాజధానిగా మార్చాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పారిశ్రామికాభివృద్ధిని సాధించేందుకు వ్యాపార వేత్తలను ఆహ్వానిస్తున్నామన్నారు. సెప్టెంబర్ 2024లో జరిగే గ్లోబల్ ఏఐ సమ్మిట్‌కు అమెరికన్ ఇండియన్ డయాస్పోర్క్ ఆహ్వానిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.