Monday, March 10, 2025

మేము తెలంగాణ ప్రజల ఆలోచనలను అమలు చేస్తాం

బిఆర్‌ఎస్ హయాంలో అస్తవ్యస్థమైన
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం
త్వరలోనే జాబ్ క్యాలండర్‌ను విడుదల చేస్తాం
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు చంద్రబాబును ఉదాహరణగా తీసుకోవడం చూస్తే ఆయన పరిస్థితి ఏమిటో అర్థమవుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. తాము తెలంగాణ ప్రజలు ఆలోచనలను అమలు చేస్తాం కానీ, ఎపి ఆలోచనలు కాదన్నారు. తాము చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. మీరు వదిలిన అస్తవ్యస్థ ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతున్నామని మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్ ఇచ్చారు. పింఛన్ల పెంపులో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, ఎపి సిఎం చంద్రబాబును ఆదర్శంగా తీసుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

12 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 పరీక్షను తామే నిర్వహించాం
సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బిఆర్‌ఎస్ హయాంలో అస్తవ్యస్థమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. 12 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 పరీక్షను తామే నిర్వహించామని శ్రీధర్ బాబు చెప్పారు. త్వరలోనే జాబ్ క్యాలండర్‌ను విడుదల చేస్తామని ఆయన చెప్పారు. ఆశ వర్కర్ల గురించి మాట్లాడే హక్కు హరీష్‌కు లేదన్నారు. వాళ్ల హయాంలోనే ఆశా వర్కర్స్ ను గుర్రాలతో తొక్కించారని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు.

త్వరలోనే ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఆయన చెప్పారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఎలక్షన్ కోడ్ వచ్చిందని, మొన్ననే ముగసిందని, కోడ్ ముగియడంతో ఇచ్చిన హామీల అమలు ప్రక్రియ ప్రారంభం అయ్యిందని ఆయన స్పష్టం చేశారు. పెద్దపల్లి ఘటనపై విచారణ జరుగుతుందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మైనర్ బాలికపై అత్యాచారం జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు. శాంతి భద్రత విషయంలో తమ ప్రభుత్వం సీరియస్‌గా ఉందని ఆయన తేల్చిచెప్పారు. మతఘర్షణల విషయంలో సీరియగా ఉన్నామని మెదక్ అల్లర్ల ఘటన వెనక ఎవరి హస్తం ఉన్న ఉక్కు పాదంతో అణచివేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com