Wednesday, April 30, 2025

పారిశ్రామిక రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలుపుతాం..

  • వికారాబాద్ జిల్లాకు భారీగా పరిశ్రమలు.
  • స్థానిక యువతకు పరిశ్రమలతో ఉపాధి
  • ఐటీ ఇండస్ట్రియల్ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు

పారిశ్రామిక రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఐటీ,  పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం వికారాబాద్ నియోజకవర్గం మోమిన్ పేట  మండలం ఎన్కతల  గ్రామ పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేసే పారిశ్రామిక వాడలో భాగంగా 44.30 కోట్లతో చేపట్టే వివిధ మౌలిక సదుపాయాలు అంతర్గత రోడ్ల నిర్మాణాలకు శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు టి.రామ్మోహన్ రెడ్డి, బి.మనోహర్ రెడ్డి, టిజిఐఐసి చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.  అనంతరం మోమిన్ పేట్  మండల కేంద్రంలోని ఎజిఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్ నలువైపులా పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

మోమిన్ పేట పారిశ్రామిక వాడలో రెండేళ్లలో రూ.5 వేల పెట్టుబడులను సాధించి 25 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనునట్లు మంత్రి తెలిపారు. పరిశ్రమలు ఏర్పాటుకు స్థానికలు ముందుకు రావాలని, ప్రభుత్వం వారిని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడులకు ముందుకొచ్చే ఔత్సాహికులను ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు స్థానికులు ముందుకురావాలని, అటువంటి వారికి ప్రభుత్వం స్థలాల కేటాయింపుతో పాటు సబ్సిడీ ప్రోత్సాహకాలను అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. వర్షాధారం వల్ల వ్యవసాయ ఆధారపడ్డ కుటుంబాలు చాలా ఉన్నాయని అలాంటి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు.

శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి కృషి చేస్తానన్నారు.  జిల్లాలో వివిధ మండలాల్లో వేల ఎకరాల భూమి ఉందని, ఆ భూముల్లో పరిశ్రమల స్థాపనలు చేస్తే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎంతగానో దోహదపడుతుందని స్పీకర్ అన్నారు. అనంతగిరి ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ.1000 కోట్లతో పనులు చేపట్టేందుకు ఒప్పందం కుదిరిందని తెలిపారు. అలాగే కోట్ పల్లి సర్పన్ పల్లి జుంటుపల్లి లక్నాపూర్  లాంటి ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తే యువతకు ఉపాధి కల్పించవచ్చని వీటిని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో నాలుగు ప్రధానమైన రోడ్లను విస్తరించేందుకు కేంద్ర మంత్రి గట్కారిని కలిసి నిధుల మంజూరుతో రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.  జిల్లాలో రూ.600 కోట్ల నిధులతో రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తుందని ఇప్పటికే పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తీసుకువెళ్తూ గత పది సంవత్సరాల లో లేని అభివృద్ధిని చేసుకుంటున్నామని స్పీకర్ ఈ సందర్భంగా తెలిపారు.

శాసనమండలి చీఫ్ విప్ పి.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పరిచినట్లుగానే పరిశ్రమల హబ్ గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.  సర్వేనెంబర్ 174 మరియు 198 లో 862 ఎకరాల స్థలం కేటాయించారన్నారు. రాబోయే ఐదేళ్లలో 15 వేల కోట్ల పెట్టుబడులతో కనీసం లక్ష నుండి లక్ష 50 మందికి ఉద్యోగ ఉపాధి కల్పన కల్పించే లక్ష్యం పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. రానున్న రెండేళ్లలో కనీసం 5000 కోట్ల పెట్టుబడులతో 25వేల మందికి ఉద్యోగాలు కల్పించాలి అనుకున్నాం. అని తెలిపారు.

జిల్లాలో  1909 పరిశ్రమలు స్థాపించబడగా 2320 కోట్ల పెట్టుబడులు రాగా 7640 మందికి ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. గత ఏడాది కాలంలో జిల్లాలో 114 పరిశ్రమలు స్థాపించబడ్డాయని తెలిపారు. ఇప్పటికీ 232 కోట్ల పెట్టుబడులు వొచ్చాయని తెలిపారు. జిల్లాలో ఐపాస్ ద్వారా ప్రభుత్వం ఇప్పటివరకు 127 మంది ఎస్సీలకు 362 మంది ఎస్టీలకు 16 మంది ఓసి బీసీలకు ఒక వికలాంగునికి పరిశ్రమల స్థాపన కోసం రూ.20 కోట్ల సబ్సిడీ ఇచ్చిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఆర్డీఓ వాసు చంద్ర టిజిఐఐసి జోనల్ మేనేజర్ కవిత తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి ఎంపీడీవో విజయలక్ష్మి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com