Friday, February 21, 2025

Venkateswara Prasad : ముఖ్యమంత్రితోమాట్లాడి పేకాట ఆడిస్తాను

  • ముఖ్యమంత్రితోమాట్లాడి పేకాట ఆడిస్తాను
  • సంచలన వ్యాఖ్యలుచేసిన టీడీపీ ఎమ్మెల్యే

ఒక్కోసారి రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు వారిని వివాదాల్లోకి నెడుతుంటాయి. అనాలోచితంగా చేసేవ్యాఖ్యలు వారికి సమస్యలు తెచ్చిపెడుతుంటాయి. ఇదిగో ఇలాగే నోరు జారిన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వివాదంలో చిక్కుకున్నారు. రాష్ట్రంలో పేకాట క్లబ్బుల్ని తెరిపిస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేశారాయన.

అనంతపురం ఆఫీసర్స్ క్లబ్‌లో పేకాట ఆడిస్తాననని,పేకాట ఆడకపోవడం వల్ల కరోనా సమయంలో 22 మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యేదగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్. అంతటితో ఆగకుండా.. అనంతపురం మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చాలా పేకాట క్లబ్బులు మూతపడ్డాయన్న ఎమ్మెల్యే.. సీఎం చంద్రబాబుతో మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్లబ్బుల్లో పేకాట ఆడేందుకు కృషి చేస్తానని చాలా గొప్పగా చెప్పారు.

ఇప్పుడు అనంతపురం అర్బన్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికివెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు బాధ్యాతాయుతమైన ఎమ్మెల్యేపదవిలో ఉండి పేకాట వంటి జూదాన్ని సపోర్ట్ చేస్తారా అంటూ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు జనం.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com