అంతరిక్షం నుంచి మీడియాతో సునితా విలియమ్స్
గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారత సంతతి వ్యామోగామి సునితా విలియమ్స్, అమెరికాకు చెందిన బుచ్ విల్‌మోర్ చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. కొన్ని వారాల క్రితం తిరిగి భూమికి రావాల్సిన వారు స్టార్ లైనర్ వ్యామోనౌకలో లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఐతే ఈ విషయంపై వ్యామోగాములు సునితా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ లు ఇంట్ర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి స్పందించారు. బోయింగ్ స్పేస్ క్యాప్సూల్ స్టార్‌లైనర్ ద్వారానే తిరిగి వెనక్కి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
బుధవారం సునీతా విలియమ్స్ తో పాటు బుచ్ విల్ మోర్‌లు అంతరిక్షం నుంచి మొదటిసారి మీడియాతో మాట్లాడారు. స్టార్ లైనర్ వ్యామోనౌక థ్రస్టర్ పరీక్ష పూర్తయ్యాక తమ తిరుగు ప్రయాణం ఉంటుందని తెలిపారు. తాము ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉండటంపై కంప్లైంట్ ఏమి చేయడం లేదని, పైగా స్పేస్ స్టేషన్ సిబ్బందికి సహాయం చేస్తూ ఎంజాయ్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ మమ్మల్ని సురక్షితంగా ఇంటికి తీసుకొస్తుంది.. ఈ విషయాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.. అనివ్యామోగామి సునీతా విలియమ్స్ స్పష్టం చేశారు.