ఎన్టీఆర్ జిల్లా నందిగామ:రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య.వీరులపాడు మండలంలో అల్లూరు,జుజ్జూరు,వెల్లంకి గ్రామాల్లో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పర్యటన.ఈ వారం రోజుల్లో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలు, రోడ్లు, ఇల్లు పరిశీలన.మండలంలో రైతులను పంట నష్టం నమోదు చేయించుకోవాలని రైతులకు ఎమ్మెల్యే సౌమ్య సూచనలు చేశారు.
ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ:ఊహించని వరదలు అధిక వర్షపాతం కారణంగా ఎంతో విపత్తు సంభవించిందని.నందిగామ నియోజకవర్గంలో మున్నేరు, కృష్ణానది వలన ఎట్టిపట్టు గ్రామాలు దెబ్బతిన్నాయి.రైతులను అన్ని విధాలుగా మా ప్రభుత్వం అందుకుంటుంది అని తెలిపిన సౌమ్య.రేపటి నుంచి వరద బాధితులకు రేషన్ సరుకులు బియ్యం, కందిపప్పు, పంచదార, నూనె పంపిణీ చేస్తామని తంగిరాల సౌమ్య అన్నారు.