Saturday, May 17, 2025

ఆర్టీసీని లాభాల బాటలో పయనించేలా కృషి చేస్తాం -వైస్ చైర్మన్ పీ.ఎస్ మునిరత్నం

విజయవాడ, తేదీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్ గా పి.ఎస్. మునిరత్నం ఆర్టీసీ హౌస్ లో అధికారుల సమక్షంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతాలకు సైతం ఆర్టీసీ బస్సులను నడుపుతున్న ఘనత ఆర్టీసీ సంస్థకే దక్కుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తారన్నారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ఉచిత బస్సు పథకాన్ని ముఖ్యమంత్రి ఆదేశాలతో అమలు చేయడం జరుగుతుందన్నారు.

రాష్ట్రానికి ఒక విజనరీ లీడర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నాకు అతి ముఖ్యమైన ఆర్టీసీ వైఎస్ చైర్మన్ పదవి అప్పగించారన్నారు. పదవికి వన్నె తెచ్చేలా ఆర్టీసీ సంస్థను అభివృద్ధి బాటలో పయనించేలా చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, యువ నాయకులు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో అందరం కలసి సంస్థ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గానికి 8 సార్లు శాసనసభ్యులుగా గెలిచిన చరిత్ర ఉందన్నారు. నాకు పదవి దక్కడం కుప్పం నియోజకవర్గానికే తలమానికం అన్నారు.

ప్రతి క్రైసిస్ ని ఒక అవకాశంగా మలచుకుని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింప చేస్తున్నారన్నారు. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ముందుకి తీసుకెళ్లగల సమర్ధత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు ఉందని, ఇలాంటి ముఖ్యమంత్రి సేవలు రాష్ట్రానికి ఎంతో అవసరం అన్నారు. 2047 కు భారతదేశాన్ని ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశంగా ఉండేలా చేయడంతోపాటు ఆంద్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచేలా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారన్నారు. ఆర్టీసీని కార్మికులు, ఉద్యోగుల సహకారంతో అభివృద్ధి లో ముందుకు నడిపేలా పనిచేస్తామన్నారు. ఏపీఎస్ఆర్టీసీ 50 వేల మంది కార్మికులతో ప్రజలకు సేవలు అందిస్తున్నందుకు కార్మికులకు అభినందనలు తెలియజేశారు.

చైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి, వైస్ చైర్మన్ పి.ఎస్. మునిరత్నం విజయవాడ వరదల్లో ఏపీఎస్ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది 130 మంది కి రూ. 1500 విలువ గల నిత్యావసర సరుకుల కిట్ ను ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్ తరపున అందించారు. తోటి వారు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి సాయం అందించడం మంచి పరిణామం అని చైర్మన్ కొనకళ్ల నారాయణ రావు తెలిపారు. వైస్ చైర్మన్ మాట్లాడుతూ విజయవాడ వరదల్లో సింగ్ నగర్ తదితర ప్రాంతాల్లో ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని.. ముఖ్యమంత్రి రాత్రింభవళ్లు పనిచేసి ఆయా ప్రజలు మమూలు స్థితికి వచ్చేలా చేశారన్నారు. సహ ఉద్యోగులు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం మానవత్వానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్, ఆర్టీసీ అధికారులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com