బంగారం కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్.. బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ రావడంతో ఆగస్టు 12వ తేదీ సోమవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు పుంజుకున్నాయి. దీంతో హైదరాబాద్ లో స్వల్పంగా బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై 250 రూపాయలు పెరగగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 270 రూపాయలు పెరిగింది. తాజా పెరుగుదలతో తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల(తులం) బంగారం ధర రూ. 64,700కు చేరుకోగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70,580గా ఉంది. ఇక, కేజీ వెండిపై 100 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 88,000 రూపాయలకు చేరుకుంది.