Wednesday, June 26, 2024

West bengal train accident: పశ్చిమ బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం

  • ఆగివున్న పాసింజర్ రైలును ఢీ కొట్టున గూడ్స్ ట్రైన్

పశ్చిమ బెంగాల్‌ లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రంగపాణి స్టేషన్‌ సమీపంలో ఈరోజు ఉదయం రైలు ప్రమాదం జరిగింది. స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలును వెనుక నుంచి వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది. దీంతో కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ ట్రైన్ వెనుక మూడు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు నలుగురు ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో గాయపడ్డారని అధికారులు తెలిపారు. కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ సీల్దా వెళ్తుండగా రంగపాణి, నిజబరి స్టేషన్ల మధ్య ఈ ఘోర ప్రమాదం జరిగింది.

 

అసోంలోని సిల్చార్ నుంచి వెస్ట్ బెంగాల్ లోని కోల్ కత్తా సమీపంలోని సీల్దాకు వెళ్తున్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ సిలిగురి దాటిన తర్వాత రంగ్‌పనీర్ స్టేషన్ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో రైలు వెనుక భాగంలో ఉన్న మూడు బోగీలు బాగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ప్రయాణీకులకు సంబంధించిన రెండు బోగీలు, ఒక పార్శిల్ బోగీ దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.

ఈ రైలు ప్రమాదంలో మరికొంత మంది గాయపడగా, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. రైల్వే పోలీసులు, విపత్తు నిర్వహణ రెస్క్యూ టీమ్‌లు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ రైలు ప్రమాదం నేపథ్యంలో ఆ మార్గంలో వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?

Most Popular