Saturday, September 14, 2024

విజయసాయిరెడ్డి-శాంతి వ్యవహారంలో అసలేం జరిగింది?

* శాంతి భర్త మదన్ మోహన్ చెబుతున్న దాంట్లో నిజమెంత?

ఆంధ్రప్రదేశ్ వైసీపీ సీనియర్ నాయకుడు. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ఏపీ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి, విజయసాయి రెడ్డికి మధ్య అక్రమ సంబంధం ఉందని స్వయంగా ఆమె భర్త ఆరోపించడంతో ఈ వ్యవహారం బయటపడింది. తాను విదేశాల్లో ఉన్నప్పుడు తన భార్య శాంతి గర్భ దాల్చిందని, పుట్టిన కుమారుడికి తండ్రి ఎవరో తెలియాలని భర్త మదన్ మోహన్ దేవాదాయ కమీషనర్ కు ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది. విజయసాయి రెడ్డి వ్యవహారంపై ప్రధాన మీడియా, సోషల్ మీడియా వేదికగా ఎంత రచ్చ జరుగుతోందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

ఇదే అదునుగా విజయసాయి రెడ్డి ముసలోడే కానీ మహానుభావుడు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.  ఈ క్రమంలోనే శాంతి మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చేప్రయత్నం చేశారు. 2013 నవంబర్ నెలలో మదన్ మోహన్ మానిపాటితో నాకు పెళ్లి అయ్యిందని, 2015లో ఇద్దరు కవల పిల్లలు పుట్టారని చెప్పుకొచ్చారు. మదన్ మోహన్ తనను దారుణంగా హింసించాడని, దీంతో 2016లోనే తాము గిరిజన సంప్రదాయం ప్రకారం విడాకుల ఒప్పందం రాసుకున్నామని చెప్పారు శాంతి. ఆ తరువాత 2019లోనే మదన్ మోహన్ ఆమెరికా వెళ్ళిపోయాడని.. 2020లో తనకు ఉద్యోగం వచ్చిందని శాంతి వివరణ ఇచ్చారు.

ఆ తరువాత న్యాయవాది సుభాష్, తాను ఇష్టపడి పెళ్లి చేసుకున్నామని శాంతి తెలిపారు. తాను నవమాసాలు మోసి బిడ్డను కన్నానని, తాను ఓ గిరిజన మహిళను కాబట్టి టార్గెట్ చేశారని ఆవేద‌న వ్యక్తం చేసింది. ఎంపీ విజయసాయిరెడ్డిని తాను విశాఖపట్నంలోనే చూశానని చెప్పిన శాంతి.. ఆయనపై దుష్ప్రచారం చెయ్యడం దారుణమన్నారు. విజయసాయి రెడ్డి వయసు 68 ఐతే, తన వయసు 35 అని.. ఇద్దరికి ఎలా సంబంధాలు అంట గడతారని ప్రశ్నించింది శాంతి. తాను విజయసాయిరెడ్డితో కేవలం డిపార్ట్ మెంట్‌కి సంబంధించిన విషయాలే మాట్లాడానని.. ఏ అధికారినైన తాను ఎంపీలు, ఎమ్మెల్యేలతో మాట్లాడకూడదా అని ఆవేద‌న వ్యక్తం చేసింది.

ఇక తనకు, శాంతికి అక్రమ సంబంధం అంటగట్టిన వాళ్లపై ఎంపీ విజయాసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారని, వైసీపీ నాయకులపై కావాలనే బురదజల్లుతున్నార‌ని ఆరోపించారు. తనపై కావాలనే నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్న విజయసాయి.. మహిళకు ద్రోహం చేశానని దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. తన ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూసేవారిని వదిలిపెట్టబోనని హెచ్చరించారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నవారు తమ వైసీపీ పార్టీ వాళ్లైనా వదలనని విజయసాయిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యవహారంపై మహిళా కమిషన్‌ సహా అన్ని కమిషన్లకూ ఫిర్యాదు చేస్తామని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

ఎంపీ విజయసాయి రెడ్డి, శాంతి ఎపిసోడ్ పై హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందించారు. త‌న మ‌ద్ద‌తు విజ‌య సాయిరెడ్డికే అని పూనమ్ ట్విట్టర్ వేధికగా స్పష్టం చేశారు. విజ‌య‌సాయి రెడ్డిగారూ.. మీ ధైర్యానికి మెచ్చుకోవాలి.. టీవీ ఛానెళ్లు బ్లాక్ మెయిల్ చేసే వ్య‌వ‌స్థ‌ల్లా త‌యార‌య్యాయి.. నా విషయంలోనూ ఇలాంటి క్రమాన్నే వాడారు.. ప్రెగ్నెంట్ అయిందని.. మనీ తీసుకుందని.. పని కోసం ఇలా చేసిందని చెబుతారు.. మనం ఏడిస్తే.. కన్నీరు కారిస్తే అదే వారి విజయం అవుతుంది.. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఇలాంటి వారి ముందు తల వంచకండి… అంటూ పూనమ్ కౌర్ విజయసాయి రెడ్డికి మద్దతు తెలిపారు.

ఇక శాంతి, విజయసాయి రెడ్డిలు స్పందించిన తరువాత, మరోసారి రెస్పాండ్ అయ్యారు శాంతి భర్త మదన్ మోహన్. 2022 జనవరిలో పీహెచ్‌డీ కోసం అమెరికా వెళ్లానని.. సెప్టెంబర్‌‌లో రావాలని.. తాడేపల్లిలో విల్లా కొనుగోలు చేస్తున్నామని శాంతి కాల్ చేసినట్లు చెప్పారు. 4 కోట్ల విల్లా 2.5 కోట్లకు విజయసాయిరెడ్డి ఇప్పిస్తున్నారని శాంతి చెప్పిందని వివరించాడు. శంషాబాద్‌లో విజయసాయిరెడ్డి ఫామ్ హౌస్ వద్దకు వస్తే, అక్కడ విజయ సాయిరెడ్డి భార్య సునంద 60 లక్షల నగదు ఇచ్చారని చెప్పాడు. అక్కడి నుంచి కారులో విశాఖపట్నం వెళ్తు.. మార్గమధ్యలో విజయవాడలో ఉన్న విల్లాను కూడా చూశానని తెలిపాడు. అప్పటికే విల్లా కోసం  విజయసాయిరెడ్డి కోటి రూపాయలు ఇచ్చారని, మరో కోటిని శాంతి సమకూర్చిందని, మొత్తం 2.60 కోట్లతో విల్లా కొనుగోలు చేశామని మదన్ మోహన్ చెప్పుకొచ్చాడు.

ఈ క్రమంలో అప్పుడు తామిద్దరం ఫిజికల్‌గా కలిశామని, ఆ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పాడు మదన్. 2022 సెప్టెంబర్ 25న తిరిగి తాను అమెరికా వెళ్లిపోయానని, ఆ తర్వాత తాను ప్రెగ్నెంట్ అని శాంతి చెప్పిందని తెలిపాడు. డౌట్ వచ్చి ఎలా అయ్యావని అడిగితే.. హౌ డేర్ టు యు ఆస్క్.. అని ఇంకొసారి అడిగితే చెప్పుతో కొడతానందని ఆవేద‌న వ్యక్తం చేశాడు. మేం ఫిజికల్ గా కలిసిన సమయంలో శాంతి కడుపులో 2 నెలల బేబీ ఉందని తర్వాత తెలుసుకున్నానని చెప్పారు మదన్. తాను శాంతిని సెప్టెంబర్‌లో కలిస్తే ఆమె 2023 ఏప్రిల్‌లో డెలివరీ అయ్యిందని.. 7 నెలల కన్నా ముందే డెలివరీ ఎలా అయ్యిందని ప్రశ్నించాడు మదన్ మోహన్.

ఇక తాను అమెరికా నుంచి 2024 జనవరి 3న వచ్చానని చెప్పిన మదన్.. అప్పటి నుంచి బిడ్డ ఎవరికీ జన్మించారనే అంశంపై ఇద్దరి మధ్య గొడవ జరుగుతోందని వివరించాడు. తాను అమెరికాలో ఉండగా ఐవీఎఫ్ చేయించుకున్నానని తన స్నేహితులతో చెప్పిందని తెలిపాడు. మరైతే ఐవీఎఫ్ అయితే ఎక్కడ చేయించుకున్నావ్.. డోనర్, ఆస్పతి పేరు అడిగితే సమాధానం చెప్పలేదన్నాడు. పట్టి పట్టి అడగ్గా శాంతి పిడుగులాంటి నిజం చెప్పిందని తెలిపాడు మదన్ మోహన్. విజయసాయి రెడ్డికి పిల్లలు లేరు, దత్తత తీసుకున్న కూతురు ఉంది.. బాబు కావాలంటే కనిపెట్టానని చెప్పిందని తెలిపాడు. అయితే ఐవీఎఫ్ కాదు.. ఫిజికల్ రిలేషన్ షిప్ ద్వారా బాబు జన్మించాడని తెలుసుకున్నానని చెప్పిన మదన్..  ఇప్పుడు తనను లైఫ్ నుంచి వెళ్లిపో అంటోందని.. తన ఇద్దరు పిల్లలు ఏం కావాలని ఆవేద‌న వ్యక్తం చేశాడు.

ఇలా విజయసాయి రెడ్డి, శాంతి, మదన్ ల ఎపిసోడ్ లో ఎవరికి వారు తమతమ వెర్షన్ వినిపిస్తున్నారు. మరిప్పుడు శాంతి భర్త మదన్ మోహన్ చెప్పిన అంశాలపై విజయసాయి రెడ్డి, శాంతిలు ఎలా స్పందిస్తారన్నదే ఆసక్తికరంగా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular