Sunday, January 5, 2025

ఐశ్వర్యరాయ్‌ చేతికి ఏమయింది? అంత పెద్ద దెబ్బా?

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీతో తన సమయాన్ని గడుపుతుంది. కానీ పలు సినిమా ఈవెంట్స్ లో మాత్రం పాల్గొంటుంది. గత సంవత్సరం పొన్నియన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకులని అలరించింది. 50 ఏళ్ళు వచ్చినా ఇంకా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ అలరిస్తుంది ఐశ్వర్య రాయ్. ఇటీవల ఐశ్వర్య ఎక్కడ కనపడినా తన కూతురు ఆరాధ్యతో కనిపిస్తుంది. ప్రస్తుతం ఫ్రాన్స్ లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది. ఈ ఫిలిం ఫెస్టివల్ కి దేశవిదేశాల నుంచి ఎంతో మంది సినీ సెలబ్రిటీలు హాజరవుతారు. ఐశ్వర్య రాయ్ కూడా ఇండియా తరపున ప్రతి సంవత్సరం కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కి హాజరవుతుంది. తాజాగా నిన్న రాత్రి ఐశ్వర్య రాయ్ తన కూతురు ఆరాధ్యతో కలిసి ముంబై ఎయిర్ పోర్ట్ లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కి వెళ్తూ కనపడింది.ఫ్రాన్స్‌ వేదికగా ఏటా కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అట్టహాసంగా జరుగుతుందన్న విషయం తెలిసిందే.

అయితే ఐశ్వర్య రాయ్ చేతికి గాయం అయి కట్టు కట్టి ఉంది. ఐశ్వర్య రాయ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వసాగాయి. ఆమె అభిమానులు, నెటిజన్లు ఐశ్వర్య రాయ్ చేతికి ఏమైంది, ఇలా చేతికి కట్టుతోనే కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొంటుందా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి చేతికి ఏమైంది అనేది ఐశ్వర్య రాయ్ మాత్రం తెలపలేదు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com