మన దేశం బాగుపడాలంటే ముందుగా ప్రజలు మారాలి. డబ్బులకు కక్కుర్తిపడి ఓట్లు వేసినంత కాలం.. మన దేశం అభివృద్ధి చెందుతుందనే గ్యారెంటీ లేనే లేదు. స్వార్థపూరితంగా వ్యవహరిస్తూ.. పార్టీలను మార్చే రాజకీయ నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలి. ఏ పార్టీ నాయకులైనా.. ఎంత పెద్ద నేతలైనా.. తమ అక్రమ ఆస్తుల్ని కాపాడుకోవడానికో.. రాజకీయ పబ్బం గడిపేందుకో పార్టీలను మార్చుకుంటూ వెళితే ఊపేక్షించకూడదు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి.. పట్నం మహేందర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరాడు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో.. ఒక్కసారిగా జంప్ జిలానీ అయిపోయాడు. ఇంతకీ సారు ఎందుకు మారాడంటే.. అతని భార్య వికారాబాద్ జడ్పీ ఛైర్మన్ సునీతా మహేందర్‌రెడ్డికి చేవెళ్ల టికెట్ ను ఇప్పించేందుకట. రేవంత్‌రెడ్డి కూడా టికెట్‌ను ఇప్పించలేడనే విషయాన్ని పట్నం మహేందర్‌రెడ్డి, సునీతా మహేందర్‌రెడ్డిలు అర్థం చేసుకోవాలి. ఒకవేళ కాంగ్రెస్ చేవేళ్ల టికెట్ ఇవ్వకపోతే వీళ్లేం చేస్తారు? ఇక్కడే ఐదేళ్లు ఉండి.. తర్వాత మరో పార్టీలోకి జంప్ అవుతారా?