Sunday, May 4, 2025

సీఎం రేవంత్ రెడ్డిని తమవాడని వాళ్లు అనుకోవడం లేదా?

  • సీఎం రేవంత్ రెడ్డిని తమవాడని వాళ్లు అనుకోవడం లేదా?
  • అసెంబ్లీలో సీనియర్ మంత్రుల మౌనం వెనుక ఆంతర్యమేంటీ?

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా జరుగుతున్నాయి. బడ్జెట్పద్దులపై అర్ధరాత్రి దాటి తెల్లవారుజాము వరకు సభలో చర్చలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో సభలో అధికార పక్షానికి, ప్రతిపక్షాలకు మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఐతేప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వంపైవిమర్శలు, ఆరోపణలు గుప్పించినప్పుడు అధికార పక్షం నుంచి అనుకున్న మేర స్పందన రావడంలేదన్న చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీ సభ్యులు ముఖ్యమంత్రితోపాటు కాంగ్రెస్ పార్టీపై దాడికి దిగినప్పుడు ప్రభుత్వం నుంచి ప్రతి దాడి జరగడంలేదన్న చర్చ జరుగుతోంది. కనీసం ప్రతిపక్షాలపై ప్రతిదాడి చేసే ప్రయత్నం కూడా అధికారపక్షం నుంచి లేదన్నది చర్చనీయాంశమవుతోంది.

అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ సభ్యులను ధీటుగా ఎదుర్కోవడానికి, వారిదాడిని తిప్పికొట్టడానికి అనుభవం ఉన్న సభ్యులు అధికార పక్షంలో లేరా అంటే అదీ కాదు.తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న మెజార్టీ మంత్రులు అపార రాజకీయ అనుభవం ఉన్న సీనియర్లే.అందులో సమైఖ్య రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన అనుభవజ్ఞులే చాలా మంది ఉన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదర రాజనర్సింహ,మంత్రులుగా పనిచేసిన తుమ్మల నాగేశ్వర రావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్కుమార్ రెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణా రావు, శ్రీధర్ బాబు లకు అటు రాజకీయాల్లోను,ఇటు పరిపాలనలోను సుధీర్గం అనుభవం ఉంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సీనియర్ఎమ్మెల్యేగా, ప్రభుత్వ చీఫ్ విప్ గా పనిచేసిన అనుభవం ఉంది. గతంలో సమైఖ్యరాష్ట్రంలో వీళ్లందరు అసెంబ్లీలో ప్రతిపక్షాలను తప్పికొట్టిన సందర్భాలు చాలాఉన్నాయి.

ఐతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వీళ్లేవరుప్రతిపక్షాలను ఎదర్కోవడం లేదన్న వాదన వినిపిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలఎమ్మెల్యేలు అసెంబ్లీలో పలు సందర్బాల్లో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించినా,ఆరోపణలు చేసినా సీనియర్ మంత్రుల నుంచి పెద్దగా స్పందన రావడం లేదన్నది చర్చ. అందులోదామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వర రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖలాంటి వారైతే సభలో వారి వారి శాఖలకు సంబందించిన అంశాలు తప్ప మిగతా సందర్బాల్లో నోరుమెదపడం లేదు. ఇక డిప్యూటీ సీఎం భట్టి విర్కమార్క సైతం తనకు సంబందించిన ఆర్ధిక,విద్యుత్ శాఖలపై చర్చ సందర్బంగానే స్పందిస్తున్నారు. కొన్ని సందర్బాల్లో సీఎంరేవంత్ రెడ్డి సభలో లేని సమయంలో తప్పదన్నట్లు రెస్పాండ్ అవుతున్నారని అసెంబ్లీలాబీల్లో చర్చించుకుంటున్నారు.

ఇక  శ్రీధర్ బాబు శాశనసభావ్యవహారాల మంత్రిగా ఉన్నారు కాబట్టి సభలో గందరగోళం నెలకొన్నప్పుడు, సభ్యుల మధ్యవాగ్వాదం చోటుచేసుకుంటున్న సమయంలో తప్పదు కాబట్టి స్పందిస్తున్నారని, అది కూడాచాలా పరిమితస్థాయిలోనే మాట్లాడుతున్నారన్న వాదన వినిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పలు సందర్బాల్లో సీఎంరేవంత్ రెడ్డిపైన, కాంగ్రెస్ పార్టీపైన, ప్రభుత్వంపైన ఆరోపణలు, విమర్శలు చేసినాఅప్పుడప్పుడు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క  తప్ప.. మిగతా సీనియర్ మంత్రులు ఎవరూ సాధ్యమైనంతవరకు మౌనం వహిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఇంతకీ మంత్రుల మౌనం వెనుకమతలబేంటన్నదే కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా రాజకీయవర్గాల్లో ఆసక్తిరేపుతోంది.

ఇందుకు ప్రధాన కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీనియర్మంత్రులెవరు ఓన్ చేసుకోవడం లేదని, మంత్రులకు-సీఎం కు మధ్య కొంత గ్యాప్ ఉందనితెలుస్తోంది. అందుకే మనకు సంబంధం లేని విషయాల్లో కలగజేసుకుని అనవసరంగా బీఆర్ఎస్ కుటార్గెట్ కావడం ఎందుకని చాలా మంది మంత్రులు సైలెంట్ గా ఉంటున్నారన్న వాదనవినిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉన్న దూరం కూడా అసెంబ్లీలో సీనియర్మంత్రుల మౌనానికి కారణమన్న మాట వినిపిస్తోంది. ఏదేమైనా దీన్ని అదునుగా తీసుకునిబీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు ధీటుగాసమాధానం చెప్పేవారు లేకపోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన కనిపిస్తోంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com