Thursday, September 19, 2024

నాగార్జున ఎన్‌-కన్వెన్షన్‌ పై వివాదం ఏంటంటే?

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు మాదాపూర్ లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఉంది. ఇందులో బిగ్ ఈవెంట్స్​ జరుగుతుంటాయి. టాలీవుడ్​కు చెందిన ఎన్నో ఈవెంట్స్ తోపాటు బడా కుటుంబాల పెళ్లిళ్లు కూడా ఈ ఎన్‌-కన్వెన్షన్‌ సెంటర్ లో జరిగాయి. అలాంటి ఈ ఎన్-కన్వెన్షన్ వివాదంలో చిక్కుకుంది. ఇది అక్రమమ నిర్మాణమంటూ గతంలోనూ ఎన్నో అరోపణలు, ఫిర్యాదులు వచ్చాయి.

2014లో కేసీఆర్ ప్రభుత్వం సర్వే చేసి.. ఎన్‌-కన్వెన్షన్‌ FTLలో నిర్మించారని తేల్చింది. అయినా.. మిగతా నిర్మాణాలను కూల్చిన అధికారులు.. ఈ కన్వెన్షన్ సెంటర్ జోలికి మాత్రం వెళ్ళలేదు. తాజాగా అక్రమ నిర్మాణాలపై ఫోకస్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. ఇప్పటికే నగరంలో నిర్మించిన పలు అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. ఎవరివైనా వదిలే ప్రసక్తే లేదని, అక్రమ నిర్మాణమని తేలితే కూల్చేస్తామని హైడ్రా అధికారులు హెచ్చరించారు.

ఈ క్రమంలో మరోసారి ఎన్-కన్వెన్షన్ పై ఫిర్యాదు చేశారు. తుమ్మిడి హడ్డి చెరువులో మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్‌ నిర్మించారని ఫిర్యాదులు రావడంతో హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం ఆరు భారీ యంత్రాలతో కన్వెన్షన్‌ కూల్చివేశారు అధికారులు. ఎన్-కన్వెన్షన్​కు వెళ్లే దారులంటినీ మూసివేసి భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు ప్రారంభించిన అధికారులు.. దాన్ని నేలమట్టం చేశారు.

కాగా, నల్లా ప్రీతంరెడ్డితో కలిసి నాగార్జున.. ఈ ఎన్‌-కన్వెన్షన్‌ ను మొత్తం 10 ఎకరాల్లో నిర్మించారు. అందులో మూడున్నర ఎకరాల తుమ్మిడి చెరువును కబ్జా చేసినట్లు అధికారులు నిర్ధారించారు. ఇందేలో 1.12 ఎకరాలు ఎఫ్‌టీఎల్‌లో పరిధిలో.. 2 ఎకరాలు బఫర్‌ జోన్‌ లో ఉందని తేల్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular