Wednesday, July 3, 2024

ఇకపై ఆ ఫోన్లలో వాట్సాప్ యాప్ పనిచేయదు

మరి మీ ఫోన్ లో వాట్సాప్ పనిచేస్తుందా?

ప్రఖ్యాత చాట్ యాప్ వాట్స్ యాప్ ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో అతిపెద్ద ఇన్‌ స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ ఫారమ్ అని చెప్పకతప్పదు. వాట్సాప్ యాప్‌ యాప్ ను ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు ఉపయోగిస్తున్నారు. అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా యాప్స్‌లో వాట్సాప్ ప్రత్యేక గుర్తింపు పొందింది. వాట్సాప్ లో మెసెజెస్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ వరకు యూజర్లకు అన్నీ అందుబాటులో ఉంటాయి. ఇక ఇప్పుడు వాట్సాప్ లో ఇంకా అనేక ఫీచర్లను జత చేస్తున్నారు. వాట్సాప్ త్వరలో చాలా స్మార్ట్ ఫోన్లలలో పని చేయదని మెటా అకస్మాత్తుగా ప్రకటించింది. ప్రముఖ బ్రాండ్లు అయిన యాపిల్, శాంసంగ్‌ తో సహా 35 స్మార్ట్‌ ఫోన్లలో వాట్సాప్ యాప్ పని చేయదని తెలిపింది

యాపిల్, సామ్ స్యాంగ్, మోచోరోలా, సోనీ, ఎల్జీ, లెనోవా సహా మరోకొన్ని కంపెనీల మొబైల్స్‌ లో వాట్సాప్ యాప్ సేవలు నిలిచిపోనున్నట్లు ఇంతకు ముందే ప్రకటించింది. వాట్సాప్ యాప్ పనితీరు మెరుగుపరచడానికి మెటా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. మెటా సంస్థ సాంకేతిక విభాగం మేరకు ఈ ఫోన్లలో వాట్సాప్ లేటెస్ట్ ఫీచర్లను వాడేందుకు అవసరమైన సిస్టమ్ అందుబాటులో లేదట. అందుకే రాబోయే రోజుల్లో ఈ 35 స్మార్ట్‌ ఫోన్లలో వాట్సాప్ యాప్ సేవలు అందుబాటులో ఉండవని కంపెనీ స్పష్టం చేసింది. ఇప్పటికే చాలా స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిపేస్తున్నట్టు కంపెనీ తెలిపింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?
- Advertisment -

Most Popular