Sunday, May 4, 2025

రెడ్డింపు వేగంతో దూసుకొస్తున్న మరో కొత్త వైరస్..

  • రెడ్డింపు వేగంతో దూసుకొస్తున్న మరో కొత్త వైరస్..
  • ప్రపంచవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటన..

ప్రపంచ వ్యాప్తంగా మంకీ పాక్స్ మహమ్మారి విజృంభిస్తోంది. చాపకింద నీరులాగా మెల్లగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు 70 దేశాలకు పాకి ఆ దేశ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఈ మంకీ పాక్స్ కారణంగా ఇప్పటికే సుమారు 100 మంది మృతి చెందారు. మహమ్మారి వ్యాప్తిని పసిగట్టిన ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. గత రెండేళ్లలో డబ్ల్యూహెచ్‌వో ఇలా ప్రకటించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ వ్యాధికి వాక్సిన్లు ఆఫ్రికా దేశాల్లో చాలా తక్కువగా ఉన్నాయని.. దీని కట్టడికి ప్రపంచ దేశాలు సాయం అందించాలని ఆయా దేశాలు అభ్యర్థించాయని డబ్ల్యూహెచ్‌వో గుర్తుచేసింది.

ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధి కేసులు అమెరికా నుంచి యూరప్‌ లతో పాటు భారతదేశంలో కూడా వెలుగులోకి వచ్చాయి. దీని తరువాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ స్థాయిలో మంకీ పాక్స్‌ను పెద్ద ముప్పుగా అభివర్ణించింది. ఇప్పుడు ఈ వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆఫ్రికాలో మాత్రమే ఎక్కువ కేసులు నమోదవుతున్నప్పటికీ.. క్రమంగా ఇతర దేశాలలో మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం కూడా పెరుగుతోంది. దీంతో అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు జారీ చేసింది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com