Friday, April 18, 2025

బిగ్‌ బాస్ సీజన్ 8లో ఎవరికి ఎక్కువ రెమ్యునరేషన్‌?

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. సెప్టెంబర్ 01 నుంచే బుల్లి తెరపై సందడి మొదలైంది. ఇక మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఈసారి హౌస్ లోకి అడుగు పెట్టారు. ఇందులో బుల్లితెర నటీనటులు, యాంకర్లు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు.. ఇలా వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఉన్నారు. యష్మీ గౌడ, నిఖిల్, అభయ్ నవీన్, ప్రేరణ, నటుడు ఓం ఆదిత్య, బెజవాడ బేబక్క, కిరాక్ సీత, నటుడు నాగమణికంఠ, నటి సోనియా ఆకుల, సీరియల్ యాక్టర్ పృథ్విరాజ్, శేఖర్ బాషా, నైనిక, నబీల్ అఫ్రీదీ ఈసారి బిగ్ బాస్ హౌస్ లో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్స్, వారి రెమ్యునరేషన్ల గురించి నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది. సాధారణంగా ఏ సీజన్ లో అయినా వారాల చొప్పున పారితోషకం చెల్లిస్తారు. బిగ్ బాస్ హౌస్ లో వారానికి ఒకరు ఎలిమినేట్ అవుతారు కాబట్టి ఎప్పుడూ వారాల ప్రకారమే కంటెస్టెంట్స్ కు రెమ్యునరేషన్ చెల్లిస్తారు. అయితే ఈ సీజన్ లో స్టార్ యాంకర్ విష్ణుప్రియకే అత్యధిక పారితోషకం చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com