పరిశీలనలో యనమల, అశోక్ గజపతి పేర్లు
ఎన్డీఏలో ముఖ్య భాగస్వామిగా ఉన్న టీడీపీకి గవర్నర్ పదవి ఇచ్చేందుకు బీజేపీ నాయకత్వం సుముఖంగా ఉంది. కేంద్రం నుంచి గవర్నర్ పదవి ఆఫర్ టీడీపీకి వచ్చింది. కేంద్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకారం తరువాత కొందరికి గవర్నర్ పదవుల కేటాయింపుపై కేంద్రంలో కసరత్తు మొదలైంది.
అందులో భాగంగా ప్రధాన భాగస్వామ్య పార్టీగా ఉన్న టీడీపీకి ఒక గవర్నర్ పదవి ఇవ్వాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ నుంచి పేరు సూచించాలని చంద్రబాబును కోరినట్లు సమాచారం.
టీడీపీ నుంచి ఎవరికి చంద్రబాబు గవర్నర్ పేరు సూచిస్తారనేది పార్టీలో చర్చ జరుగుతోంది. టీడీపీ నుంచి ఇద్దరి పేర్లు ప్రముఖంగా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. రేసులో సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు ఉన్నట్లు సమాచారం. ఈ ఇద్దరిలో ఒకరి పేరును చంద్రబాబు ఎంపిక చేసే అవకాశం ఉంది.