Friday, February 21, 2025

ఎవరు చంపించారు..? రాజలింగమూర్తి మర్డర్ వెనుక నిర్మాణ సంస్థ పేరు

సామాజిక కార్యకర్త, కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయపోరాటం చేస్తున్న రాజలింగమూర్తి దారుణ హత్య వెనక ఎవరున్నారనే అంశం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. బుధవారం రాత్రి ఆటోలో వచ్చిన ఐదుగురు గుర్తు తెలియని దుండగులు రాజలింగమూర్తిని నడిరోడ్డుపై కత్తులతో పొడిచి పరారయ్యారు. ఈ ఘటనలో పేగులు భయటపడటంతో రాజలింగమూర్తి స్పాట్ లోనే మృతి చెందాడు. ప్రభుత్వపరంగా ఇప్పటికే కేసీఆర్‌ కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నారు. మేడిగడ్డ విచారణకు ఒక్కరోజు ముందు ఈ హత్య జరుగడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజలింగమూర్తి కోర్టుకు రాకూడదనే, కాంట్రాక్టర్లే ఆయన్ను చంపారంటూ స్థానికంగా చర్చ నడుస్తోంది. దీంతో రాష్ట్రానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ, కాళేశ్వరంలో కీలక పనులు చేసిన కాంట్రాక్ట్‌ కంపెనీపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా కాళేశ్వరం స్కామ్‌పై గత కొంతకాలంగా రాజలింగమూర్తి పోరాటం చేస్తున్నారు. కాళేశ్వరం అవకతవకలపై హైకోర్టులో ఆయన పిటిషన్ కూడా వేశారు. గురువారం కాళేశ్వరం కేసుపై హైకోర్టులో విచారణ ఉండగా రాజలింగమూర్తి దారుణ హత్యకు గురికావడంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. రాజలింగమూర్తి కోర్టుకు రాకూడదనే చంపేశారా అనే అనుమానాలు నెలకొన్నాయి. కాంట్రాక్టర్లే రాజలింగమూర్తిని చంపారంటూ స్థానికంగా చర్చ నడుస్తోంది. దీంతో ఓ ప్రముఖ కంపెనీపై అనుమానాలు మొదలయ్యాయి. కాళేశ్వరం అవకతవకలపై ప్రముఖ నిర్మాణ సంస్థతో పాటు కేసీఆర్‌, హరీష్‌రావు, పలు ఐఏఎస్‌ అధికారులపై కేసు నమోదు కోసం రాజలింగం కోర్టుల చుట్టూ తిరిగారు. ఈ కేసులో ఇప్పటికే మేఘాకృష్ణారెడ్డి, కేసీఆర్‌, హరీష్‌ రావు, స్మితాసభర్వాల్‌కు భూపాలపల్లి సెషన్స్‌కోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందని అధికార కాంగ్రెస్, బీజేపీలు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీపై విమర్శలు చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఒక్క ప్రాజెక్టులోనే ప్రభుత్వ సహకారంతో ఓ నిర్మాణ సంస్థ వేల కోట్ల ప్రజాసొమ్మును దోచుకున్నాడన్న ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.
ఇక, భూపాలపల్లి మున్సిపాలిటీలోని రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న రాజలింగమూర్తి భార్య సరళ గత పాలకవర్గంలో బీఆర్ఎస్ తరఫున 15వ వార్డు కౌన్సిలర్​గా పోటీ చేసి గెలిచింది. బీఆర్ఎస్ ​ప్రభుత్వ హయాంలో రాజలింగమూర్తి పై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఆ తర్వాత పీడీ యాక్ట్ పెట్టి జైలుకు తరలించారు. జైలు నుంచి బయటకు వచ్చాక కేసీఆర్, హరీష్ రావులతో పాటుగా మరికొంతమంది అధికారులపై మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు విషయంలో ప్రైవేట్ కేసు వేశారు రాజలింగమూర్తి.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com