Thursday, December 12, 2024

మంచు ఫ్యామిలీ రచ్చలో వినయ్ ఎవరు?

తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతున్న మంచి ఫ్యామిలీ గొడవలో వినయ్ అనే పేరు తరచుగా వినిపిస్తోంది, అసలు ఎవరు ఈ వినయ్ అని ఆరా తీయగా, అతను మోహన్ బాబు యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ట్రస్టీ ఆన్ బైర్డ్ గా వ్యవహరిస్తున్నారు.

వినయ్ పూర్తి పేరు వినయ్ మహేశ్వరి ఆయన గతంలో 2019 నుండి 2022 వరకు సాక్షి మీడియా సంస్థల CEO గా పనిచేశారు, అనంతరం కొన్ని రోజులు ఇండియా టీవీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ సీఈవోగా విధులు నిర్వహించారు.

ప్రస్తుతం ఇతను మోహన్ బాబు యూనివర్సిటీ తో పాటు, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ (నిర్మాణ సంస్థ) మేనేజింగ్ పార్ట్నర్ గా మరియు Sucstrat Consulting Private Limited కి మేనేజింగ్ డైరెక్టర్ & CEO గా విధులు నిర్వహిస్తున్నాడు.

ఇతను నెలలో ఒకటి రెండు రోజులు తిరుపతి మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో అంటూ, మిగిలిన సమయం అంతా హైదరాబాద్, ఢిల్లీ , ముంబై, దుబాయ్ నగరాల్లో ఉంటాడని అతని సన్నీహిత వర్గం తెలుపుతోంది.

కొంతకాలం క్రితం మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన ఫీజుల అక్రమాలపై ఇతనిని కలవడానికి ప్రయత్నించిన విద్యార్థి సంఘ నాయకులని కూడా ఇతను కలవడానికి నిరాకరించారు.

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular