Wednesday, November 20, 2024

70 మంది రిటైర్డ్ ఇంజినీర్లలో ఎంత‌మంది వెళ్లారు?

టీఎస్​, న్యూస్​: మేడిగడ్డ టూర్​తో తమ పనితనాన్ని నిరూపించుకునేందుకు బీఆర్ఎస్​ నేతలు చేసిన ప్రయత్నాలను రిటైర్డ్​ ఇంజినీర్లు ఊహించని షాక్​ ఇచ్చారు. బీఆర్ఎస్ మేడిగడ్డ టూర్ లో బీఆర్​ఎస్​కు షాక్​ తగిలింది. అధికారంలో ఉన్నప్పుడు వెన్నంటి ఉన్న 70 మంది ఇంజినీర్లలో 68 మంది ఇవాళ్టి మేడిగడ్డ సందర్శనకు వెళ్లలేదు. కేవలం ఇద్దరు మాత్రమే వెళ్లడం గమనార్హం. రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ శ్యాంప్రసాద్ రెడ్డికి కేటీఆర్ ఫోన్ చేసినా ఫలితం లేక పోయింది. మాజీ మంత్రి హరీశ్ రావు స్వయంగా వెళ్లి బతిమాలినా ఆయన మేడిగడ్డకు వెళ్లకపోవడం గమనార్హం. బీఆర్ఎస్ నేతలతో కలిసి రిటైర్డ్ ఇంజినీర్లు తన్నీరు వెంకటేశం, దామోదర్ రెడ్డి మాత్రమే వెంట వెళ్లారు. ఇంజినీర్ల సలహాలు తీసుకోకుండా అప్పటి సీఎం కేసీఆరే స్వయంగా డిజైన్ చేశారని ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. తాము అక్కడికి వెళ్లినా ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంటుందనే విశ్రాంత ఇంజినీర్లు మేడిగడ్డ సందర్శనకు దూరంగా ఉన్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, నాసిరకం పనుల నేపథ్యంలో ఇప్పటికే ఇద్దరు ఇంజినీర్లపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. తాము వెంట వెళ్లి కేసులను కొని తెచ్చుకోవడం ఎందుకనే ఉద్దేశంతోనే పలువురు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular