Wednesday, April 2, 2025

కెసిఆర్, మోడీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు – సీఎం రేవంత్ రెడ్డి

టీఎస్ న్యూస్ :ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవిత విషయంలో తండ్రిగా కేసీఆర్ ఇంకా రియాక్ట్ కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందనీ , కనీసం పార్టీ సభ్యురాలిగా కూడా కవితను చూడడం లేదన్నారు. ప్రధాని మోదీ సైతం దీనిపై స్పందించడం లేదన్నారు. కేసీఅర్, మోదీ మౌనం వెనక మతలబ్ ఏంటి? అని రేవంత్ ప్రశ్నించారు. ఇద్దరూ కలిసి చీప్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. మోదీ, కేసీఆర్ డ్రామాలు ఆపాలన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ను దెబ్బ కొట్టేందుకు నాటకం ఆడుతున్నారని రేవంత్ అన్నారు. లిక్కర్ స్కాంపై కేసీఆర్ కుటుంబం, బీజేపీ ప్రభుత్వం సీరియల్‌లో మాదిరిగా డ్రామా చేస్తున్నారన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు కవితను అరెస్ట్ చేయడం దేనికి సంకేతమని రేవంత్ ప్రశ్నించారు. ఇద్దరూ కలిసి వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడ చేస్తున్నారన్నారు. ఈ డ్రామాను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. ముందు ఈడీ వస్తుందని.. ఆ తర్వాత మోదీ వస్తారని గతంలో అనేవారని.. కానీ నిన్న ఈడీ, మోదీ కలిసే వచ్చారని రేవంత్ సెటైర్ వేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com