Saturday, May 10, 2025

వైమానిక దాడులు రాత్రే ఎందుకు జరుగుతాయంటే?

వైమానిక దాడులు పగలు కాకుండా రాత్రి పూట ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే దానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. సర్జికల్ స్ట్రైక్‌, ఆపరేషన్ సింధూ కూడా రాత్రే జరిగింది. అయితే పగటిపూట డ్రోన్లు, విమానాలను రాడార్‌తోపాటు సైనికులు ఎలక్ట్రో-ఆప్టికల్ ద్వారా గుర్తించగలరు. కానీ రాత్రి రాడర్ మాత్రమే గుర్తిస్తుంది. అది మిస్ అయితే ఆపరేషన్ సక్సెస్ అయినట్లేనని రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ కల్నల్ దన్వీర్ సింగ్ చెబుతున్నారు.
2025 మే 6-7 రాత్రిని పాక్ ఎప్పటికీ మరచిపోలేదు. భారత్ 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. అయితే ఆపరేషన్ సింధూను భారత్ రాత్రిపూటనే చేపట్టింది. 2019లోనూ బాలాకోట్ వైమానిక దాడి, సర్జికల్ స్ట్రైక్‌లను భారత సైన్యం రాత్రిపూట నిర్వహించింది. ఈ నేపథ్యంలో రాత్రిపూట మాత్రమే వైమానిక దాడులు ఎందుకు జరుగుతాయి? పగటిపూట వైమానిక దాడులు ఎందుకు చేయరు అనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతుంది. పగటిపూటచేసే దాడి రాడార్ దృష్టితోపాటు దేశ సైనికుల దృష్టిలో పడుతుంది. కానీ రాత్రి అలా కాదు. రాత్రి ఆప్టికల్ వినియోగించలేం. రాత్రిపూట దాడిచేసే విమానాలను ఎలక్ట్రానిక్‌ రాడర్ మాత్రమే ట్రాక్ చేస్తుంది. అది మిస్ అయితే శత్రువు ఆపరేషన్ సక్సెస్ అయినట్లే’ అని ఆయన వివరించారు. అందుకే ఏ దేశమైనా రాత్రిపూటనే దాడులకు పాల్పడుతుందని, రాత్రి లక్ష్యాన్ని ఈజీగా ట్రేస్ చేయొచ్చని ఆయన చెబుతున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com