Friday, January 10, 2025

సీఎం చుట్టూ బీఆర్ఎస్ నేత‌ల ప్ర‌ద‌క్షిణాలు ఎందుకు?

( టీఎస్​ న్యూస్​, హైద‌రాబాద్ )

అప్పుడు కాంగ్రెస్​.. ఇప్పుడు బీఆర్ఎస్​. అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు నేతలు లైన్​ కడుతున్నారు. బీఆర్ఎస్​ అధికారంలో ఉన్నప్పుడు నిధుల కోసం అంటూ చెప్పుకుంటూ వెళ్లిన కాంగ్రెస్​ఎమ్మెల్యేలు గులాబీ కండువా మార్చుకున్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితి సొంత ప్రయోజనాలకు మళ్లింది. పదేండ్లు అధికారంలోఉండి వెనకేసుకున్న భూములను, సంపదను కాపాడుకునేందుకు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్​ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే 26 మంది ఎమ్మెల్యేలు రేవంత్​తో రాయబేరాలు సాగిస్తున్నారు. తాజాగా గ్రేటర్​ మేయర్​ కూడా అదే దారిలో పడ్డారు.

మా భూములు ప్లీజ్​
గ్రేటర్​ శివారులోని ఎమ్మెల్యేలు వందల ఎకరాల్లో భూములు సంపాదించిన విషయం బహిరంగమే. వాటిలో కొన్ని ప్రభుత్వ భూములు ఉంటే.. మరికొన్ని కబ్జా భూములున్నాయి. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కాంగ్రెస్​ ప్రభుత్వం రావడం, అందులోనూ భూ సంబంధిత అంశాల్లో అపార అనుభవం ఉన్న రేవంత్​ రెడ్డి సీఎం కావడంతో.. తమ భూములను రక్షించుకునేందుకు గులాబీ ఎమ్మెల్యేలు రాయబారానికి వెళ్లక తప్పడం లేదు.

* గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన ఓ సీనియర్​ నేత.. రేవంత్​రెడ్డిని సాలే అంటూ సంబోధిస్తూ సవాల్​కు దిగిన విషయం తెలిసిందే. కానీ, ప్రభుత్వం మారిన నేపథ్యంలో సదరు ఎమ్మెల్యేకు చెందిన మెడికల్​ కాలేజీ నిర్మించిన భూమి వ్యవహారంలో సీఎం రేవంత్​ అధికారులకు సూచనలిచ్చారు. అంతే.. ఇప్పుడు సదరు ఎమ్మెల్యే ఉన్న ఫళంగా మాట మార్చారు. రేవంత్​.. తాను టీడీపీలో దోస్తులమే అంటూ తీయని మాటలను పలుకుతున్నారు.

* మరో శివారు ఎమ్మెల్యే కూడా రాజేంద్రనగర్​ పరిధిలోని 30 ఎకరాల భూమి కోసం రేవంత్​ దగ్గరకు చేరేందుకు సిద్ధమయ్యాడు. దాదాపు ఇందులో 14 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండటంతో పాటుగా కొంత లిటిగేషన్​లో ఉన్న భూమిని తన పేరుమీదకెక్కించుకున్నాడు. ఇప్పుడు ఈ వ్యవహారం అంతా తెలిసిన రేవంత్​రెడ్డి.. ఎలాగైనా దీనిపై ఫోకస్​ చేస్తారనే భయంతో రేవంత్​ దగ్గరకు చేరేందుకు రాయబేరాలు సాగిస్తున్నారు.

* పటాన్​చెరు దగ్గర చెరువుకు సంబంధించిన 8 ఎకరాలను తన ఖాతాలో వేసుకున్న ఓ బీఆర్ఎస్​ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్​లో చేరేందుకు ఓ సీనియర్​ నాయకుడి దగ్గరకు పరుగులు పెడుతున్నాడు. తాజాగా మేయర్​ విజయలక్ష్మీ కూడా బంజారాహిల్స్​లో నివాస స్థలాన్ని ప్రభుత్వం నుంచి అతి తక్కువ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కేకే వారసులకు ఇక్కడ భూమి ఇచ్చారు. ఇప్పుడు ఆ భూమిని కాపాడుకునేందుకు సీఎం రేవంత్​ను కలిసి, పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com