ఓవైపు ‘దేవర’ మరో వైపు ‘వార్ – 2’ చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నాడు తారక్. వరుస పాన్ ఇండియా చిత్రాలతో భవిష్యత్ సంచలనంగా మారబోతున్నాడు. ప్రస్తుతం కొరటాలతో దేవరపై వందశాతం ఫోకస్ చేసిన తారక్ షూటింగ్ కోసం గోవా వెళ్లాడు. ఎన్టీఆర్ ఇటీవలే శంషాబాద్ విమానాశ్రయంలో కనిపించగానే అతడి ప్రయాణంపై ఆరాలు మొదలయ్యాయి. అతడు గోవా షెడ్యూల్ కోసం బయలుదేరారని తెలిసింది. గోవా విమానం ఎక్కే ముందు విమానాశ్రయంలో తారక్ ఎంతో రిలాక్స్ డ్ గా కనిపించాడు. బ్లూ డెనిమ్స్, ఫుల్ స్లీవ్స్ లో అతడు ఎంతో స్టైలిష్ గా కనిపించాడు. అతడిని చూడగానే విమానాశ్రయంలో చాక్లెట్ బోయ్ ఎవరు? అంటూ కొందరు నెటిజనులు ఫన్నీగా ప్రశ్నించారు. దీనికి కారణం తారక్ మునుపెన్నడూ కనిపించనంత ఛామింగ్ గా కనిపిస్తున్నాడు ఈ లుక్ లో. ప్రస్తుతం గోవాలో ల్యాండ్ అయ్యాడు గనుక అభిమానులు సెట్స్ నుండి అప్‌డేట్‌ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేవర చిత్రానికి కొరటాల దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఇంతకుముందే రిలీజ్ చేసిన విజువల్ గ్లింప్స్ కి అభిమానుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. దేవరకు సంబంధించిన ప్రతి అప్ డేట్ అభిమానుల్లో ఉత్కంఠ పెంచుతోంది. అలా సడెన్ షాకిచ్చాడు: మోస్ట్ అవైటెడ్ మల్టీస్టారర్ ‘వార్ 2’లో ఎన్టీఆర్ పాత్ర గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉంటుందో రివీల్ చేస్తూ ఇంతకుముందు రిలీజ్ చేసిన పోస్టర్ సర్వత్రా ఆసక్తిని పెంచింది. నిజానికి అతడి లుక్ మునుపటి అంచనాలకు భిన్నంగా ఉంది. నిజానికి హృతిక్ కథానాయకుడిగా కనిపిస్తే తారక్ విలన్ గా కనిపిస్తాడని ప్రచారమైంది. కానీ తాజా లుక్ రివీల్ కాగానే, ఇద్దరూ కొలీగ్స్ అన్న సంగతి అర్థమైంది. ఈ ఇద్దరూ పఠాన్ 2 , టైగర్ వర్సెస్ పఠాన్ చిత్రాలలోను అతిథి పాత్రలతో తిరిగి వచ్చే అవకాశం ఉన్నందున విస్తృతమైన వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్‌లో ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేసి వదిలేస్తున్నారని భావిస్తున్నారు.