తెలంగాణ ఉద్యమంలో తాము జైలుకు వెళ్లామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పదేపదే జైలుకు వెళ్లానని చెప్తున్నాడని, ఆయన ఏం పని చేసి జైలుకు వెళ్లాడని అసెంబ్లీలో ప్రశ్నించారు. అప్పుడు ఎందుకు జైలుకు వెళ్లాడో అందరికీ తెలుసు అని, ఇప్పుడు ఆయన జూబ్లీహిల్స్ ప్యాలెస్ పై డ్రోన్ పంపిస్తే ఊరుకుంటారా అని కేటీఆర్ మండిపడ్డారు. అక్కడ డ్రోన్ ఎగురవేసి ఆయన భార్యనో, బిడ్డో అక్కడ ఉంటే ఫోటోలు తీస్తే ఎలా ఉంటుందన్నారు. ఆనాడు తమ ఇళ్లపై ఎలా డ్రోన్ ఎగరెస్తారని ప్రశ్నించారు. అప్పుడు తమ పిల్లలపై ఇష్టం ఇచ్చినట్లు మాట్లాడారని, మైనర్ పిల్లలు అని చూడకుండా నా కొడుకు, బిడ్డను ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. డ్రోన్ కేసులో జైలుకు వెళ్లిన చరిత్ర రేవంత్ రెడ్డిది అని, అలాంటి ఆయన తనకు రంకు అంటగట్టి ఎలా పడితే అలా మాట్లాడారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.