చినుకు చినుకు గాలి వానగా మారుతోంది సంధ్య థియేటర్ వ్యవహారం. సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో నిప్పులు చెరగడం ఆపై దానికి ప్రతిగా అన్నట్లు బన్నీ ప్రెస్‌మీట్ పెట్టడం జరిగిపోయాయి. కానీ ఈ వ్యవహారం అక్కడితో ఆగలేదు. మంత్రులు, పోలీస్ అధికారులు రంగంలోకి దిగిపోయారు. హెచ్చరికలు తీవ్రం అయ్యాయి. ఇదంతా కలిసి ఇండస్ట్రీ మీద ప్రభావం చూపించేలా కనిపిస్తోంది. ఇక ఇప్పుడు మిగిలింది సంధి చేయడమే. ఇటు అటు మాట్లాడే వారు కావాలి. బన్నీ వైపు నుంచి ఎలాగు ఇక ప్రతిస్పందన అనేది ఉండదు. కానీ ప్రభుత్వం వైపు నుంచి సంధి కుదర్చాలి. ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవాలి. లేదంటే భవిష్యత్తులో టాలీవుడ్‌కు కష్టం. సంక్రాంతికి సినిమాలు ఉన్నాయి. థియేటర్లు రన్ కావాలి. ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ జరగాలంటే ప్రభుత్వ ఆగ్రహాన్ని చల్లార్చాలి. ఇలాంటి పని చేయాలంటే మరి ఇప్పుడు పవర్‌స్టార్ ఒక్కరి వల్లనే సాధ్యం అవుతుంది. సురేష్‌బాబు, అశ్వినిదత్, మెగాస్టార్ లాంటి పెద్దలు రంగంలోకి దిగాల్సి ఉంది. కానీ ఈ పనికి పూనుకోవడానికి మరి మెగాస్టార్.. పవర్‌స్టార్లు ముందుకు వస్తారా లేదా అన్నది చూడాలి.