Friday, January 10, 2025

“అంబాజీపేట మ్యారేజి బ్యాండు” బేబిలాగా హిట్‌ అవుద్దా?

సుహాస్ హీరోగా నటిస్తున్న సినిమా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకురానుంది. హైదరాబాద్ లో హీరో అడివి శేష్ అతిథిగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ – తెలుగు సినిమా రంగం గొప్ప టెక్నీషియన్స్ ను చూసింది. పాతాళభైరవి, శంకరాభరణం లాంటి గొప్ప సినిమాలను మన దర్శకులు తెరకెక్కించారు. కొంతకాలం తర్వాత తెలుగు సినిమా అంత గొప్ప సినిమాలు తెరకెక్కించలేకపోయిందనే అపవాదు తెచ్చుకుంది. మిగతా పరిశ్రమల్లోనూ కొత్త నీరు వస్తోంది. న్యూ టాలెంట్ చిత్ర పరిశ్రమను కంటెంట్ ఓరియెంటెడ్ గా ముందుకు తీసుకెళ్తున్నారు. తెలుగులో ఎస్ కేఎన్, సాయి రాజేశ్, బన్నీ వాసు, ధీరజ్ అలాంటి ప్రయత్నం చేస్తున్నందుకు వారిని అభినందిస్తున్నా. బేబి లాంటి మూవీని కేవలం కంటెంట్ ఓరియెంటెడ్ గా తీసి వారు సూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా కూడా అలాంటి హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com