Friday, January 10, 2025

ఈ కాంబో సెట్‌ అవుతుందా?

ఏపీలో ఎలక్షన్స్‌ దగ్గర పడుతున్న విషయం తెలిసిందే. దీంతో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం తన ఫోకస్‌ అంతా కూడా రాజకీయాల పైనే పెట్టారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌లన్నీ కూడా పక్కన పెట్టేసినట్లే కనిపిస్తుంది. ఇక మళ్లీ బాస్‌ సెట్స్‌ పైకి రావాలంటే ఎన్నికల తరవాతే అనిపిస్తుంది. ఇప్పటికే పవన్ ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజి వంటి సినిమాలకు కమిట్ అయ్యాడు. ఈ సినిమాలన్నీ కొన్ని షెడ్యూల్స్ షూటింగ్స్ కూడా జరుపుకున్నాయి. అయితే ఇవన్నీ కూడా ఎన్నికల పూర్తి అయ్యే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి వంటి సినిమాలు వచ్చాయి. వీటిలో జల్సా, అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్ అయింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ వీరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. కానీ పవన్ కళ్యాణ్ చివరగా గెస్ట్ రోల్ చేసిన ‘బ్రో’ సినిమాకి మాత్రం గురూజీ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే ఈసారి ఎలాగైనా పవన్ కళ్యాణ్ కి హిట్ ఇవ్వాలని త్రివిక్రమ్ పవన్ కోసం అదిరిపోయే స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నట్లు లేటెస్ట్ ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఒకవేళ వీరి కాంబినేషన్ కనుక ఓకే అయితే ఈ ప్రాజెక్టును హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మించే అవకాశాలు ఉన్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com