Friday, January 10, 2025

సొహైల్‌ సెంటిమెంట్‌ వర్క్‌ అవుట్‌ అవుతుందా?

ఈ మధ్య కాలంలో సెంటిమెంట్లు బాగానే వర్క్‌అవుతున్నాయి. అదెలా అనుకుంటున్నారు. ఇటీవలె జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కౌశిక్ రెడ్డి తన భార్య, కూతురితో కలిసి జనాలకు దండం పెడుతూ తనను ఈసారి ఎన్నికల్లో గెలిపించకపోతే ఆత్మహత్యే శరణ్యం అంటూ దీనంగా వేడుకున్నారు. అయితే ఈ కిటుకు బాగానే పనిచేసిందని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఓ సినిమా హీరో కూడా స్టేజ్‌ మీద కన్నీళ్లు పెట్టుకుని మరీ ధీనంగా అడుగుతున్నాడు. తన సినిమా చూడాలని ప్రేక్షకులను కోరడం చర్చనీయాంశంగా మారింది. ఆ హీరోనే.. సోహెల్. బిగ్ బాస్ షోతో పాపులారిటీ సంపాదించిన సోహెల్ ఆల్రెడీ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ అనే వెరైటీ సినిమా చేశాడు. అందులో ఓ సాహసోపేత పాత్ర చేశాడు. కానీ సరైన ఫలితం రాలేదు.

ఇప్పుడు సోహెల్ హీరోగా ‘బూట్ కట్ బాలరాజు’ అనే సినిమా రాబోతోంది. ఫిబ్రవరి 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో సోహెల్ ప్రసంగం అందరినీ కదిలించింది. నిర్మాత పాషాకు సినిమా సగంలో ఉండగా ఆర్థిక సమస్యలు రావడంతో సినిమా ఆగిపోయే పరిస్థితి వచ్చిందని.. ఆ స్థితిలో ఇల్లు కొనుక్కుందామని తాను దాచుకున్న డబ్బు, తన తండ్రి పెన్షన్ సొమ్ము కలిపి సినిమా మీద ఖర్చు చేశానని.. తన దగ్గర పబ్లిసిటీ చేయడానికి కూడా డబ్బులు లేవని కన్నీళ్లు పెట్టుకున్నాడు. మోకాళ్ల మీద కూర్చుని దయచేసి తన సినిమా చూడాలని ప్రేక్షకులను కోరాడు. బిగ్ బాస్ షోతో తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు సోహెల్. వాళ్లు కొంతమేర ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ రిలీజ్ టైంలో సపోర్ట్ చేశారు. మరి ఉండేకొద్ది ఆ ఫేమ్‌ కాస్త.. కాస్తగా తగ్గుతుంటుంది. మరి ఈ సినిమాకి సొహెల్‌ కి ఎలాంటి ప్రేక్షకాదరణ దక్కుతుందా చూడాలి మరి.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com