Wednesday, September 18, 2024

భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్ వెళ్తుందా? అమిత్ షా ఏమన్నారు?

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ లో పాల్గొనేందుకు భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్ కు వెళ్తుందా? లేదా అన్నదానిపై నిన్నటి వరకు క్లారిటీ లేదు. వచ్చే సంవత్సరం 2025లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తోంది. ఈ ఐసీసీ ఈవెంట్‌ను సక్సేస్ చేసేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే సన్నాహాలు చేస్తోంది. ఐతే ఈ టోర్నీలో పాల్గొనేందుకు టీమిండియా పాకిస్థాన్ వెళ్తుందా లేదా అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతూ వస్తోంది. భారత ప్రభుత్వం అనుమతి ఇస్తేనే టీమ్ ఇండియా ను పాక్‌కు పంపుతామని బీసీసీఐ ప్రకటించింది. ఈ క్రమంలో ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీవలక ప్రకటన చేశారు.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు పాకిస్థాన్‌ కు వెళ్లడం లేదని అమిత్ షా తేల్చి చెప్పారు. హోం మంత్రి అమిత్ షా గత శక్రవారం జమ్మూ కాశ్మీర్‌లో రాబోయే ఎన్నికలకు ముందు హబీజేపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌ దుందుడుకు చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. దీంతో పాటు భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాల మెరుగుదలపై తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించే వరకు పాకిస్థాన్ ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు ఉండవని చెప్పారు. ఇప్పుడు అమిత్ షా ప్రకటనను ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా వర్తింపజేయడం వల్ల భారత ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ భారత ఆటగాళ్లను అక్కడికి పంపి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోదని తేలిపోయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular