ఇంధన ధరలతగ్గింపుపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
భారత్ లోఅంతకంతకు పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇంధనం ధరలవిషయంలో రాష్ట్రాలన్నీ కలిసి వస్తే సవరించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.పార్లమెంట్ లో కేంద్ర ఆర్ధిక బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత వరుసగా మీడియాకు ఇంటర్వ్యూలుఇస్తున్న నిర్మలా సీతారామన్.. ఇటీవలె పలు రాష్ట్రాల్లో అమలవుతున్న ఉచిత బస్సు పథకంతోపాటు మిగిలిన ఉచిత పథకాలపై స్పందించారు.
ఈ సందర్బంగాఓ మీడియా ఇంటర్వ్యూలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంధన ధరల తగ్గింపుపై జీఎస్టీ కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకుంటుందనిఆమె స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలమధ్య సయోధ్య కుదరాలని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోపెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై ఈ సారి ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఐతే ఇంధనధరల విషయంలో అన్ని రాష్ట్రాలు కలిసివస్తేనే సానుకూలత ఉంటుందని కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ చెప్పారు. ఇక బడ్జెట్ పై ఇండియా కూటమితో పాటు, పలు రాష్ట్రాలు చేస్తున్నఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏ రాష్ట్రానికీ అన్యాయంజరగలేదని అన్నారు. బీజేపీ మిత్ర పక్షాలు అధికారంలో ఉన్న ఏపీ, బీహార్ రాష్ట్రాలను మాత్రమేబడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను నిర్మాలాసీతారామన్ఖండించారు.