బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో గత మూడు రోజులుగా చిరు జల్లులు పడటంతో పాటు చలి తీవ్రత ఎక్కువైంది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచే ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. శీతాకాలంలో వర్షం పడుతుండటంతో చలి తీవ్రత పెరిగి ప్రజలు నాన అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే రాబోయే ఐదు రోజుల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.