Thursday, January 23, 2025

విప్రో భారీ విస్తరణ-దావోస్‌లో ఒప్పందం

ఐటీ ఉద్యోగాలకు రెక్కలు వచ్చాయి. ఐటీ ఎంప్లాయిస్‌ అందరికీ శుభవార్త. ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో హైదరాబాద్ లో తమ క్యాంపస్ ను విస్తరించనున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని గోపనపల్లిలో మరో ఐటీ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. ఈ సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్ జీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం విప్రో నుంచి ఈ కీలక ప్రకటన వెలువడింది.

మరోవైపు, హైదరాబాద్ లో విప్రో విస్తరణ నిర్ణయాన్ని రేవంత్ స్వాగతించారు. విప్రో వంటి ప్రఖ్యాత సంస్థలకు అనువైన వాతావరణం కల్పించేందుకు, తగిన మద్దతు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. విప్రో విస్తరణతో తెలంగాణలో ఐటీ రంగం మరింత వృద్ధి చెందుతుందని అన్నారు. కొత్త విప్రో సెంటర్ రాబోయే రెండు, మూడేళ్లలో పూర్తవుతుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో విప్రో చేసుకున్న ఒప్పందంతో ఐటీ పెట్టుబడుల గమ్యస్థానంగా రాష్ట్ర ఖ్యాతి మరింత పెరుగుతుందని చెప్పారు.

 

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com