Saturday, April 19, 2025

10 వేల కోట్ల అప్పు కోసం..!

  • ఐటీ పరిశ్రమకు కేటాయించిన 400 ఎకరాలు తాకట్టు
  • బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​

హైదరాబాద్‌లో భూములను తాకట్టు పెట్టాలని రేవంత్‌ రెడ్డి సర్కారు చూస్తున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) అన్నారు. ఐటీ పరిశ్రమకు కేటాయించిన సుమారు 400 ఎకరాల భూమిని ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీలకు తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల రుణాన్ని తీసుకోవడానికి యత్నిస్తున్నదని ఆరోపించారు. భూములను తాకట్టు పెడితే కొత్త పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఈ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

‘హైదరాబాద్‌లో ఐటీ, అనుబంధ పరిశ్రమలకు కేటాయించడానికి ఉద్దేశించిన సుమారు 400 ఎకరాల విలువైన భూమిని ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలకు తాకట్టు పెట్టి రూ. 10 వేల కోట్ల రుణాన్ని తీసుకోవడానికి రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తున్నది అనే వార్త ఆందోళన కలిగిస్తున్నది.

నగరం చుట్టుపక్కల ఐటీ, అనుబంధ రంగాల పరిశ్రమలు వచ్చి, తెలంగాణ యువతకు ఉద్యోగాల కల్పన జరగాలె. కానీ ఈ భూములు తాకట్టు పెడితే కొత్త పరిశ్రమలు ఎలా వస్తాయి?. ఈ ప్రతిపాదన వెంటనే విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.’ అంటూ ట్వీట్‌ చేశారు

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com