Wednesday, January 22, 2025

కోపం లేదు…సోనూతో కలిసి పని చేస్తా

వివాదాల బ్యూటీ కంగన గురించి తెలియని ఏమీ లేదు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తూనే ఉంటుంది ఈ భామ. ప్ర‌తిసారీ త‌న కొత్త సినిమా విడుద‌ల స‌మ‌యంలో వివాదాస్ప‌ద అంశాల‌తో హెడ్ లైన్స్ లో నిలుస్తుంది. ఇప్పుడు ఎమ‌ర్జెన్సీ రిలీజ్ స‌మ‌యంలోను అందుకు భిన్నంగా లేదు. ఈ చిత్రం విడుద‌లకు ముందు నుంచి కంగ‌న పేరు వివాదాల్లో న‌లుగుతోంది. ఇటీవల ఓ పోడ్‌కాస్ట్‌లో సినీ తారలతో తనకు ఉన్న స్నేహం, వారితో వివాదాల గురించి ఓపెన్‌గా మాట్లాడింది. క్వీన్ కంగనా చాలా మంది బాలీవుడ్ నటులు, ద‌ర్శ‌క‌నిర్మాతలతో వివాదాలున్నాయ‌ని అంగీక‌రించింది. అలాగే న‌టుడు సోనూసూద్‌తో మ‌ణిక‌ర్ణిక స‌మ‌యంలో త‌లెత్తిన వివాదం గురించి మాట్లాడింది. ఇటీవ‌లే క‌ర‌ణ్ జోహార్ తో వివాదం గురించి ప్ర‌స్థావించిన కంగ‌న అత‌డితో మ‌ళ్లీ క‌లిసి ప‌ని చేసేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని, అయితే స్నేహం మాత్రం చేయ‌న‌ని తెగేసి చెప్పింది. అలాగే సోనూసూద్‌తో వివాదం గురించి కంగ‌న ప్ర‌స్థావించింది. 2019లో సోనూసూద్‌తో కలిసి ‘మణికర్ణిక’ చిత్రంలో కంగ‌న న‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే సెట్‌లో వారి మధ్య వివాదం తలెత్తడంతో సోనూ సినిమా నుంచి తప్పుకున్నాడు. అటుపై కంగనతో తాను మాట్లాడనని తన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తాజాగా కంగన అత‌డి పేరు చెప్ప‌కుండానే… త‌న‌పై కోపంగా ఉన్న వ్య‌క్తుల‌తో ప్రొఫెష‌న‌ల్ గా స‌మ‌స్య‌లేవీ లేవ‌ని, క‌లిసి పని చేసేందుకు అభ్యంత‌రం లేద‌ని తెలిపింది. మీరు ఎవరిని కలిసినా మీ స్నేహితుడిగా మారాల్సిన అవసరం లేదు. నాపై ఎవరు కోపంగా ఉన్నా త‌ప్పేమీ లేదు. నేను చాలామంది భిన్న‌మైన ఆలోచ‌న‌లు ఉన్న న‌టుల‌తో ప‌ని చేసాను. వ్య‌క్తిగ‌తంగా అవ‌త‌లి వ్య‌క్తి న‌చ్చినా న‌చ్చ‌క‌పోయినా వృత్తిగ‌తంగా క‌లిసి ప‌ని చేసేందుకు అభ్యంత‌రాలు లేవ‌ని కంగ‌న అంది. ఎవరి గురించి అయినా తీర్పు చెప్పే హక్కు నాకు లేదు అని కూడా అంగీక‌రించింది.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com