- తొలివిడతగా రూ.103కోట్లకు ఆమోదం
- వచ్చేనెలలో టెండర్లు పిలవాలని నిర్ణయం
కృష్ణానదిపైన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి బహుళార్ధసాధక ప్రాజెక్టుగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు రిపేర్లకు నిధులు సమకూర్చేందుకు ప్రపంచబ్యాంకు ముందుకు వచ్చింది.ఈ ప్రాజెక్టును పలు దఫాలుగా పరిశీలన చేస్తువచ్చిన ప్రపంపచ బ్యాంకు ప్రతినిధుల బృందం ఎట్టకేకలు నిధులు సమకూర్చేందుకు సముఖత వ్యక్తం చేసింది. శ్రీశైలం జలాశయంపైన ప్రపంచబ్యాంకు ప్రతినిధుల బృందం, డ్యామ్ సేఫ్టీ అధికారులు, కేంద్ర జలసంఘం అధికారులు రెండు రోజులుగా చేస్తున్న అధ్యయనం మంగళవారం ముగిసింది. ప్రపంచ బ్యాంకు పరిశీలన పరీశీలన అనంతరం డ్యామ్ మరమ్మతులకోసం పేజ్ 1 కింద రూ.103 కోట్లు సమకూర్చేందుకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఆమోదం తెలిపారు.
నవంబర్ లో డ్యామ్ మరమ్మత్తులకు టెండర్లు పిలవనున్నట్లు తెలిపిన సిఈ కబీర్ భాష వెల్లడించారు. డ్యాం ముందు భాగం లో ఏర్పడిన ప్లాంజ్ ఫుల్ కి రూ. 10 కోట్లు కేటాయింపు చేశారు. జలాశయం అప్రోచ్ రోడ్డు,కొండ చరియల మరమ్మత్తులకు కూడా అవసరమైన నధులు సమకూర్చేందకు ప్రపంచ బ్యాంకు అంగీకారం తెలిపింది. 2011 నుండి 2024 వరకు పూడిక ద్వారా జలాశయంలో నీటినిలువ సమార్ధం 9 టీఎంసీలు నీరు తగ్గిందని డ్యామ్ సేఫ్టీ అధికారి నూతన కుమార్ తెలిపారు. ఏపీలో నూతన ప్రభుత్వం హయంలో శ్రీశైలం ప్రాజెక్టు రిపేర్లకోసం రూ. 103 కోట్లకు ప్రపంచబ్యాంకు ఆమోదం తెలపడం ఆనందకరం అన డ్యామ్ సేఫ్టీ అధికారి నూతన కుమార్ తెలిపారు. డ్యాం ముందు భాగంలో ఏర్పడిన ప్లాంజ్ ఫుల్ ప్రస్తుతం సుమారు 46 మీటర్ల లోతు ఉందన్నారు. మూడేళ్ల తర్వాత మరో మారు శ్రీశైలం జలాశయంలో పూడికపై అధ్యయనం చేయిస్తామని నూతన్ కుమార్ పేర్కొన్నారు.