తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశగా సమర్థమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం (ఔజుఖీ) ప్రత్యేకంగా అభినందించింది. సుసంపన్నత, నగర రవాణా సౌకర్యాలు, న్యాయపూర్వక ఆర్థిక వృద్ధి వంటి అత్యవసరమైన గ్లోబల్ అంశాలపై ఆయన చూపిన దృష్టి, లోతైన అవగాహన, విశ్వవ్యాప్త లక్ష్యాలపై స్పష్టమైన ఆలోచనలతో ప్రపంచ వేదికపై తెలంగాణ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ఔజుఖీ తన అధికారిక లేఖ ద్వారా రేవంత్ రెడ్డి సుదూరదృష్టిని, సమర్థమైన ఆలోచన విధానాన్ని, సమాజ హితం కోసం ఆయన చేపడుతున్న కార్యక్రమాలను ప్రత్యేకంగా కొనియాడింది. ముఖ్యంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తెలంగాణ అభివృద్ధికి అమలు చేస్తున్న ప్రణాళికలు, నగర రవాణా వ్యవస్థను సులభతరం చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించే ప్రణాళికలు ఏర్పడ్డాయన్నారు. సమాజంలో సమానత్వాన్ని పెంపొందించి, వృద్ధిని న్యాయబద్ధంగా ప్రజలందరికీ చేరువ చేయడం పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధిపై ఆయన అవలంబిస్తున్న స్పష్టమైన విధానాలు ఈ అన్ని అంశాలను ప్రస్తావిస్తూ ఔజుఖీ ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.