Saturday, April 19, 2025

సెట్స్‌లో అందరిముందే బట్టలు విప్పమన్నాడు

సినిమా సెట్‌లో తన సహనటుడు డ్రగ్స్ తీసుకుని అసభ్యంగా ప్రవర్తించాడని విన్సీ ఇటీవల కేరళ ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేసింది. నటుడు షైట్‌ టామ్‌ చాబో పై ఈ ఫిర్యాదు నమోదు అయింది. కేసు నమోదు చేయడానికి తగిన సమాచారం లభిస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. నటి వెల్లడించిన విషయంపై స్టేట్ ఇంటెలిజెన్స్ కూడా విచారణ ప్రారంభించింది. విన్సీ నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేయడానికి పోలీసులు కూడా ప్రయత్నాలు ప్రారంభించారు. విన్సీ కేరళ ఫిలిం ఛాంబర్ కి, ‘అమ్మ’ అసోసియేషన్ కి ఫిర్యాదు చేసింది.
డ్రగ్స్ తీసుకునే వారితో నటించనని విన్సీ అలోషియస్ ఇటీవల చెప్పిన వీడియో వైరల్ అయ్యింది. దీని తర్వాత నటిపై సైబర్ దాడి కూడా జరిగింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని వివరిస్తూ విన్సీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో కూడా వైరల్ అయ్యింది. ఒక ప్రముఖ నటుడు సినిమా సెట్‌లో బహిరంగంగా డ్రగ్స్ తీసుకుని ఇబ్బంది పెట్టాడని ఆ వీడియోలో విన్సీ చెప్పింది. ఆ నటుడు ఎవరో కాదు. షైన్ టామ్ చాకో తెలుగులోకి నాని దసరా చిత్రంతో అడుగుపెట్టాడు. ఈ మూవీలో షైన్ టామ్ చాకో విలన్ గా ఇచ్చిన పెర్ఫార్మెన్స్ కి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత షైన్ టామ్ చాకో రంగబలి, దేవర, డాకు మహారాజ్, రాబిన్ హుడ్ లాంటి చిత్రాల్లో నటించారు. అద్భుతమైన అవకాశాలు వస్తున్న తరుణంలో అతడిపై డ్రగ్స్ ఆరోపణలు రావడం షాకింగ్ అనే చెప్పాలి. ఆ షూటింగ్‌ జరుగుతున్నన్నిరోజులు విన్నీ చాలా ఇబ్బంది పడినట్లు తన ఇస్‌స్టాగ్రామ్‌ పేజ్‌ ద్వారా తెలిపింది. త ముందే దుస్తులు మార్చుకోమని చెప్పారని తెలిపింది. అందరి ముందే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసేవారని తన జీవితంలో ఇదొక అసభ్యకరమైన సంఘటనగా చెప్పుకొచ్చింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com