Saturday, May 10, 2025

వావ్​.. బిజినెస్​ మైండ్​ యుద్ధంలో డ్రోన్​ వ్యాపారం

సరిహద్దుల్లో ఉద్రిక్తతతో భారత స్టాక్ మార్కెట్ కూడా ఒత్తిడి ఎదుర్కొంది. కానీ డ్రోన్లు తయారు చేసే కంపెనీల షేర్లు మాత్రం పెరిగిపోయాయి. పాకిస్తాన్‌తో పెరుగుతున్న వివాదంలో భారతదేశం మానవరహిత యుద్ధ విమానాలను ఎక్కువగా వినియోగిస్తోంది. డ్రోన్లుగా పిలిచే UMVలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే స్టాక్ మార్కెట్‌లో వీటిని తయారు చేసే సంస్థల షేర్ల ధరలు పెరిగాయి. ఐడియాఫోర్జ్, డ్రోనాచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్ ,జెడ్ఎన్ టెక్నాలజీస్ వంటి స్టాక్‌లు శుక్రవారం బాగా పెరిగాయి. ఈ కంపెనీలు రక్షణ శాఖకు సంబంధించిన డ్రోన్లు తయారు చేస్తాయి. లాహోర్, ముల్తాన్‌లలో పాకిస్తాన్ కు చెందిన వాయు రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయడానికి భారత దళాలు ఆత్మాహుతి డ్రోన్‌లను ఉపయోగించాయి. ఇవి లక్ష్యాన్ని ఖచ్చితంగా చేధించడంతో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్‌ఇ)లో ఐడియాఫోర్జ్ టెక్నాలజీ షేర్లు ధర దాదాపు 17 శాతం పెరిగి రూ. 450కి చేరుకున్నాయి. ఇంట్రాడే ట్రేడ్‌లో డ్రోనాచార్య 5%, జెడ్ఎన్ టెక్నాలజీస్ 5% , పరాస్ డిఫెన్స్ దాదాపు 5% పెరిగాయి. మానవ రహిత వ్యవస్థలు రక్షణ నిల్వలలో కీలకం. భారతదేశం దీర్ఘకాలిక రక్షణ సంసిద్ధత ఈ రంగాల్లో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. భారతదేశం ఈ ఆర్థిక సంవత్సరంలో రక్షణ బడ్జెట్ రూ. 6.81 లక్షల కోట్లుగా కేటాయించింది. ఇందులో రూ. 1.8 లక్షల కోట్లు మూలధన వ్యయం చేస్తారు. అంటే రక్షణ పరికాల కోసం కేటాయిస్తారు. తాజా పరిస్థితులతో కేంద్రం మరింతగా కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది. ఐదు సంవత్సరాలలో 130 బిలియన్ డాలర్ల మార్కెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా LCA తేజస్, ఆస్ట్రా క్షిపణులు, AMCA జెట్‌లు అధునాతన రాడార్ , ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వ్యవస్థలతో సహా వైమానిక దళం , నేవీ ను అప్ గ్రేడ్ చేయనున్నారు.
గురువారం ఉదయం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం ఖచ్చితమైన వైమానిక దాడులు నిర్వహించింది. ఇందులో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ కాశ్మీర్ అంతటా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ డ్రోన్, క్షిపణులతో ప్రతీకార దాడికి దిగింది. . పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థలను నాశనం చేయడానికి భారతదేశం హరోప్ ఆత్మాహుతి డ్రోన్‌లను ఉపయోగించింది. స్వదేశీ, రష్యన్ , ఇజ్రాయెల్ మూల వ్యవస్థలతో కూడిన భారతదేశ సమగ్ర వైమానిక రక్షణ నెట్‌వర్క్ ముప్పులను సమర్థంగా అడ్డుకుంటోంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com